తెలంగాణ లో ఎన్టీఆర్ శతజయంతి సన్నాహాలు

తెలంగాణ లో ఎన్టీఆర్ శతజయంతి సన్నాహాలు

17 పార్లమెంట్ స్థానాలు పరిధిలో భారీ సభలు

ఈనెల 29 న వర్నిలో ప్రారంభ సభ

మే 20 న మిర్యాలగూడ లో ముగింపు సభ

కార్యాచరణ సిద్ధం చేసిన టిటిడిపి అధ్యక్షుడు కాసాని

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వంద సభలు నిర్వహించాలని టిడిపి ఇప్పటికే నిర్ణయించింది. దానిలో భాగంగా తెలంగాణ లోనూ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నిర్ణయించారు. తెలంగాణ లో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 29 న ప్రారంభమై వచ్చేనెల 20 వ తేదీ తో ముగిసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతిఏటా మే 27,28 తేదీలలో జరిగే మహానాడుకు ముందు జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వున్నది. ఈ ఏడాది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఎన్టీఆర్ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధమైంది.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభల నిర్వహణ ఏర్పాట్లపై టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే పలుమార్లు పార్టీ నాయకులతో చర్చించారు. సభాల నిర్వహణపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ఆధారంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే తెలంగాణ లోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 29 వ తేదీన జహీరాబాద్ నియోజకవర్గం లో ప్రారంభం కానున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మే 20 వ తేదీన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగియనున్నాయి.

తెలంగాణ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల షెడ్యూల్

ఏప్రిల్ 29 : జహీరాబాద్ పార్లమెంట్. నియోజకవర్గం వర్ని (బాన్సువాడ నియోజకవర్గం)

మే 3: మహబూబ్ నగర్ పార్లమెంట్

మే 4: భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్,(మునుగోడు నియోజకవర్గం)

మే 6: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్వాన్

మే 7 : ఖమ్మం పార్లమెంట్లో ఖమ్మం

మే 8 : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు

మే 9 : సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మసాబ్ ట్యాంక్ (ఖైరతాబాద్ నియోజకవర్గం)

మే 10: మెదక్ పార్లమెంట్ పరిధిలోని నరసాపూర్

మే 11 : న ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఉట్నూర్

మే 12 : న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్

మే 13 : నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కొల్లాపూర్

మే 14 : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మందమర్రి (చెన్నూర్ నియోజకవర్గం)

మే 15 : చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పరిగి

మే 16 : వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్

మే 17 : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆర్మూర్

మే 19 : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బాచుపల్లి (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం)

మే 20 : నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడ

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *