ఓజీ.. మాంచి స్పీడు లో ఉంది  !

ఓజీ.. మాంచి స్పీడు లో ఉంది !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు తన అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. మా అన్నయ్య మా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే మరింత ఖుషీ అయిపోతుంటారు.ఫాన్స్ కి ఒక డౌట్ ఉండేది కళ్యాణ్ గారు రాజకీయాలలో పది మూవీస్ చేయరేమో అని బట్ అటు రాజకీయాలను ఎటు సినిమాలను రెడితిని బాలన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ .

ఇప్పుడైతే అన్ని ఎక్కువ రీమేక్ మూవీస్ ఐతే త్వరగా షూటింగ్ ఐపోతాయని అటువంటి చిత్రాలకే ఓకే చెప్పి షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నారు. తాజాగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైన్ లో పెట్టారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓజీ చిత్రం షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది.

OG సినిమా మేకింగ్ స్పీడు చూస్తుంటే హరిహర వీరమల్లు చిత్రం కంటే ముందే రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు సంబంధించిన పార్ట్ అంతా ముంబయిలో పూర్తయిందట. ఈ క్రమంలోనే చిత్రబృందం ముంబయికి టాటా చెప్పి హైదరాబాద్ కు వచ్చేస్తున్నారుట. ఏది ఏమైనా డైరెక్టర్ సుజీత్ పర్ ఫెక్ట్ ప్లానింగ్ వల్లే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయిందని అంతా అంటున్నారు. ఇంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసినందుకు గాను ఆయనను అభినందిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం మంచి మంచి ప్రాంతాలను వెతికేందుకు దర్శకుడు సుజిత్ తన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్తో కలిసి గతంలో ముంబైకి వెళ్లారు. నగరమంతా తిరిగి వారికి కావాల్సిన ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లి షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ పిక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పవన్ బ్లూ కలర్ టీషర్టు ధరించాడు. సన్ గ్లాసెస్ తో అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చాడు. మెడలో రెడ్ కలర్ తాడుకు తాయత్తు కట్టి ఉంది. ఈ లుక్ చూసిన పీకే అభిమానులు ఫుల్ ఖష్ అవుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *