
సైకిల్ పై ఇంటింటికీ వెళ్లి పేపర్ వేస్తున్న ఎమ్మెల్యే
- Ap political StoryNewsPolitics
- July 3, 2023
- No Comment
- 16
టిడ్కో ఇళ్ల వ్యవహారంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఎండగడుతున్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. టిడ్కో ఇళ్లు టీడీపీ హయాంలోనే 90శాతం పూర్తయ్యాయి. మిగతా 10శాతం నిర్మాణాలు పూర్తి చేస్తే, పేదల సొంతింటి కల సాకారమవుతోంది. కానీ, జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా, మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం లేదు. దీంతో, ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు రామానాయుడు.
కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెట్టవద్దని, పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రంగులు వేయడం కాదు, మిగిలిన 10 శాతం ఇళ్లు పూర్తి చేయాలని ప్లకార్డులతో సైకిల్ పై తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఇంటింటికి వెళ్లి పేపర్ వేసి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అద్దె ఇంట్లో ఉన్న ..పేదల బాధలను సీఎంకు తెలపాలనే ఉద్దేశంతోనే సైకిల్ పై తిరుగుతూ పేపర్ వేస్తున్నానన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్ళు తెరవాలని, మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తిచేసి పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరారు.