ఒకే స్టేజ్ పై పాన్ ఇండియా స్టార్స్.. పండుగే పండుగ

ఒకే స్టేజ్ పై పాన్ ఇండియా స్టార్స్.. పండుగే పండుగ

టాలీవుడ్ టాప్ హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ అంతా ఒకే వేదికపై కనువిందు చేయబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరగనున్న వేడుక అందుకు వేదిక కాబోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరూ ఒకే స్టేజ్ పై కనిపించనున్నారన్న వార్తతో అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఖైతలాపూర్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కి నందమూరి ఫ్యామిలీ గ్రాండ్ గా ప్లాన్ చేసింది.

తెలుగువారి ఇలవేల్పు అయిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా విజయవాడలో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధిగా జరిగిన ఈవెంట్ సక్సెస్ అవ్వగా.. అంతకు మించి భారీ లెవల్లో హైదరాబాద్ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులకు పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ లో సినీస్టార్స్ అంతా ఒకే స్టేజ్ కి రానుండడంతో అభిమానుల్లో సందడి నెలకొంది.

మరోవైపు, టాలీవుడ్‌లోని బిగ్ స్టార్స్ అందరినీ ఆహ్వానించడంతో.. చరిత్రలో మిగిలిపోయే ఈవెంట్‌గా ఇది మిగిలిపోతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ సహా .. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , విక్టరీ వెంకటేష్ , జయప్రద, జయసుధలతో పాటు పురేంధేశ్వరి సహా మరికొందరు హాజరు కాబోతున్నట్లుగా కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *