బీసీలంటే జగన్‌కు .. ఎందుకంత చిన్నచూపు?

బీసీలంటే జగన్‌కు .. ఎందుకంత చిన్నచూపు?

వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కేడీలు.. భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్‌ల అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. ఆదిరెడ్డి కుటుంబం.. నీతి నిజాయితీ ఏంటో రాజమండ్రి ప్రజల్ని అడగండి చెబుతారని,జగన్‌ ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసినా భయపడేది లేదని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేంతవరకు విశ్రమించేది లేదని, అరెస్టు చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ లను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

జగన్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదని మాజీ మంత్రి యనమల అన్నారు. వైసీపీ సర్కార్ అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడి ప్రజా సమస్యలపై పోరాటానికి వెనక్కు తగ్గేదే లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై పోరాటం ఆపేదే లేదని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబసభ్యుల అక్రమ అరెస్ట్‌ పిరికిపంద చర్య అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు చిట్‌ ఫండ్‌ కంపెనీ నిర్వహించడం జగన్‌ దృష్టిలో నేరమా? వాళ్లేమీ జగన్ రెడ్డిలా.. సూట్‌ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్లు దోచుకోలేదని యనమల అన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్‌ ని గొడ్డలివేటుకు బలిచేయలేదని.. ఏం తప్పు చేశారని వారిని అరెస్ట్‌ చేశారని యనమల ప్రశ్నించారు.

సీఐడీని అడ్డుపెట్టుకుని ఎంతమందిని అరెస్ట్‌ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ టీడీపీకి ఓటు వేయకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారన్నారు. అది విఫలం కావడంతో కక్ష పెట్టుకున్నారని .. బీసీలను అణగదొక్కుతున్నారని యనమల అన్నారు. బీసీలను నేతలుగా .. టీడీపీ తయారుచేస్తే .. జగన్‌ మాత్రం వారికి రాజకీయ అవకాశాలు దూరం చేస్తున్నారని విమర్శించారు. బీసీలంటే జగన్‌కు ఎందుకంత చిన్నచూపని .. బీసీలు నేతలుగా ఎదగకూడదా అని మండిపడ్డారు. బీసీల ఇళ్లను.. ధ్వంసం చేసి.. వారి భూములు బలవంతంగా లాక్కున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆదిరెడ్డి భవానీ కుటుంబసభ్యుల అరెస్ట్‌కు జగన్‌ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యనమల హెచ్చరించారు.

టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అక్రమ అరెస్టును ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఖండించారు. బీసీ అనే పేరు వింటే జగన్‌కు ఎందుకంత బీపీ అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో బీసీలపై దాడులు, అక్రమ కేసులు నిత్యకృతమయ్యాయని.. అనురాధ అన్నారు. తాత రాజారెడ్డి నుంచి మనవడు జగన్‌ వరకు అంతా బీసీలపై కక్ష సాధిస్తున్నారన్నారని..జగన్ నాలుగేళ్ల పాలనలో బీసీలకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. బీసీల్నీ ఆర్దికంగా.. రాజకీయంగా అణిచివేస్తున్న జగన్‌కు బుద్ది చెప్పేందుకు బీసీలంతా సిద్దంగా ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో జగన్‌ను ..ఓడించి.. బీసీల పవర్‌ ఏంటో చూపుతామన్నారు. బీసీ ద్రోహి జగన్‌ను రాష్ట్రం నుంచి సాగనంపాలని.. అనురాధ పిలుపునిచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *