జెట్ స్పీడ్ లో పవర్ స్టార్

జెట్ స్పీడ్ లో పవర్ స్టార్

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా హీటెక్కిస్తున్నాయి. కానీ అవేమీ పట్టనట్లు.. జనసేన అధినేత.. పవర్ స్టార్, పవన్ కల్యాణ్ .. తాను కమిటైన సినిమాలన్నీ కంప్లీట్ చేసుకునే పనిలో… కూల్ గా ఉంటున్నారు. మొత్తంగా 5 సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ.. 2024 ఎన్నికల నాటికి తన సినిమాల షూటింగ్ లను పూర్తి చేసేలా.. కృత నిశ్చయంలో ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్ చూసి … అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలె మొదలైన తమిళ బ్లాక్ బస్టర్ ‘వినోదయ సీతమ్’ రీమేక్‌ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జులై 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్.. దర్శకత్వంలో.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ లో ఇటీవలే.. పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సినిమాలో.. తనకు సంబంధించిన సన్నివేశాలన్నీ.. కంప్లీట్ చేశారన్న వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్.. ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చారు. మొత్తంగా ఈ సినిమా కోసం.. 90 రోజులపాటు కేటాయించినట్టు సమాచారం. అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినట్లు తెలుస్తోంది. జూన్, జూలైలో .. రెండో షెడ్యూల్ పూర్తి చేస్తారన్న వార్తలు .. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని.. మైత్రీ మూవీ మేకర్స్ శరవేగంగా పూర్తి చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అంటే పవన్ కల్యాణ్ .. ఈ చిత్రాన్ని ఎంత స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారో.. అర్థమవుతోంది.

సాహో.. దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో.. ఓజి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు.. ఇప్పటికే పవన్ రెడీ అయ్యారు. ప్రస్తుతం లొకేషన్‌ వేటలో సుజీత్ ఉన్నాడు. ఈ సినిమా కథ మొత్తం.. ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో.. ఓజి టీమ్ అక్కడే లొకేషన్లు ఫైనల్ చేసేసింది. ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానున్న.. ఓజీ సినిమా షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ వారం రోజులు ఉంటుందట. ఇలా ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌ లలో .. పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. కానీ ఉస్తాద్, ఓజిలతో పాటే.. వీరమల్లు షూటింగ్ కూడా ఫినిష్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కు సంబంధించిన మరో ప్రాజెక్టు బయటకు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథతో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు.. ‘రావణాసుర’ మూవీ ప్రమోషన్స్ సమయంలో సుధీర్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని.. 2024 ఎన్నికల తర్వాతే సుధీర్ ప్రాజెక్ట్ కి .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ మాత్రం ఈ ఏడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఐదారు నెలల్లో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఆ వెంటనే.. సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయబోయే.. ప్రాజెక్ట్ ని మొదలు పెడతారని.. సినీ వర్గాలు అంటున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం .. అందిస్తుండగా.. ఈ ఏడాది.. సెప్టెంబర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. మొత్తానికి పవన్ స్పీడ్ ను చూసి.. ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేసి.. రాజకీయాలపై.. ఫుల్ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.

 

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *