పాలిటిక్స్‌లో  మిస్సింగ్ స్టార్‌గా  మారిన పవర్ స్టార్..!

పాలిటిక్స్‌లో మిస్సింగ్ స్టార్‌గా మారిన పవర్ స్టార్..!

ఏపీలో ఓవైపు ఎలక్షన్ హీట్ పెరుగుతుండగా.. మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పడరాని పాట్లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉండాల్సినవన్ కళ్యాణ్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. సినిమా షూటింగ్స్ అంటూ.. సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు.

దీంతో ఏపీ పొలిటికల్ పిక్చర్ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ అదృశ్యం హాట్ టాపిక్‌గా మారుతోంది. పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే వాదన మరోసారి బలంగా వినిపిస్తోంది. ఇంతకీ పాలిటిక్స్‌లో కూడా పవర్ స్టార్‌గా వెలగాల్సిన పవన్.. మిస్సింగ్ స్టార్‌గా ఎందుకు మారిపోతున్నారు..? ఆయన అదృశ్యానికి కారణాలు ఏంటి..?

2014 లో జనసేన పార్టీ‌ని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా గుర్తింపు పొందలేక పోయారనే చెప్పాలి. అలా వచ్చి… ఇలా మెరిసి అదృశ్యమయ్యే తారలాగా ఆయన పొలిటికల్ కెరీర్ కొనసాగుతోంది. సడన్ గా జనాల్లోకి వచ్చి హడావుడి చేయటం.. ఆవేశంగా కొన్ని స్టేట్ మెంట్లు ఇవ్వటం.. ఆ వెంటనే అదృశ్యం అయిపోవటం.. కామన్ అయిపోయింది.

ఆయన ఎప్పుడు సీన్‌లోకి వస్తారో.. ఎప్పుడు మాయం అయిపోతారో.. ఎవరికీ అంతుపట్టని మిస్టరీలా మారింది. వాస్తవానికి ఉదయం నిద్ర లేచింది మొదలు…. రాత్రి పడుకునే వరకు నిత్యం జనాల్లో ఉన్నా.. పార్టీ వ్యవహరాలను చక్కపెట్టటం అధినేతలకు తలకుమించిన భారమే. అలాంటిది పవన్ కళ్యాణ్ మాత్రం.. ఇవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా సినిమాలు, షూటింగ్స్ అంటూ తనపని తాను చేసుకుంటున్నారు.

వాస్తవానికి ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుకుంది. అటు సీఎం జగన్.. ఇటు విపక్షనేత చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అధికారపక్షం చేసే తప్పులను ఎండ గట్టటమే పనిగా ఆయన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి.. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతల కోసం ఉద్యమాన్ని చేపట్టారు. ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నష్టపోయిన రైతుల కోసం.. అక్కడే మకాం వేసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నారు. అయితే.. మరో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న జనసేన మాత్రం.. ఈ విషయంలో ఘోరంగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండగా.. ఇక్కడ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసే వారే కరువయ్యారు. దీంతో.. ఆ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని అంటున్నారు.

వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలను.. జనసేన పార్టీకి కొద్దిగా ఎడ్జ్ ఉన్న ప్రాంతంగా చెబుతున్నారు. ఇలాంటి చోట అకాల వర్షాలకు రైతులు పడుతున్న ఇబ్బందులను.. జనసేనాని పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సి ఉంది. కానీ.. జనసైనికులకు ఆయన అడ్రస్ ట్రేస్ చేయటమే కష్టంగా మారింది.

సాధారణ ఎన్నికలు మరో ఏడాది కూడా లేని ప్రస్తుత తరుణంలో తమ పార్టీ అధినేత ఇలా అదృశ్యం కావటం పట్ల జనసైనికుల్లో కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్‌గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్.. తాజాగా ఆ పేరును సార్ధకం చేసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. రాజకీయాలు, ప్రజా సమస్యలకన్నా ఆయన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. ఇలాగైతే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపటం కష్టమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *