
పాపం పసివాడు అంటూ సీఎం జగన్ రెడ్డిపై ట్విట్టర్‌లో పవర్ పంచ్‌లు..
- Ap political StoryNewsPolitics
- May 18, 2023
- No Comment
- 28
తెలుగుదేశం పార్టీతో పొత్తు దాదాపు కన్ఫర్మ్ అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇవ్వటంతో.. సీఎం జగన్ రెడ్డిలో కోపం, అసహనం, బాధ, భయం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఆయన ఏ సభకు వెళ్ళినా పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తనకు తాను పేదల వర్గ ప్రతినిధిగా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను పెత్తందార్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. సీఎం జగన్ రెడ్డి అమాయక చక్రవర్తిలా మాట్లాడుతున్న మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా “పాపం పసివాడు” “నోట్లో వేలు పెడితే కొరకలేడు” అంటూ పవన్ పెట్టిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ట్విట్టర్‌లో “పాపం పసివాడు” అంటూ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఆ తరువాత దానికి కొనసాగింపుగా “పాపం పసివాడు” “నోట్లో వేలు పెడితే కొరకలేడు” అంటూ మరో ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన స్థాయి మరిచి మరీ చేస్తున్న వ్యాఖ్యలకు.. కౌంటర్‌గా పవన్ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు. సినిమాటిక్ గా పాపం పసివాడు పోస్టర్లను జగన్ ను ఉద్దేశించి పోస్టు చేశారు. “పాపం పసివాడు.. నోట్లో వేలు పెడితే కొరకలేడు” అంటూ సూట్ కేసుల్లో.. నోట్ల కట్టలతో వెళుతున్న జగన్ పోస్టర్‌ను పవన్ షేర్ చేయటంతో.. అది వైరల్ గా మారింది. జగన్ మోహన్ రెడ్డిలో దాగున్న అవినీతి కోణాన్ని ఆవిష్కరించేలా ఉన్న ఈ పోస్టర్‌ను నెటిజన్లు షేర్లు మీద షేర్లు చేసేస్తున్నారు.
ఇక అవినీతి, అక్రమ సంపాదనతో వేల కోట్ల రూపాయలు పోగేసుకున్న జగన్ రెడ్డి… తాను ఒక పేదలా మట్లాడటాన్ని పవన్ తప్పు పట్టారు. మనీ లాండరింగ్.. సూట్ కేస్ కంపెనీలతో ప్రజా సంపదను కొల్లగొట్టిన ఓ అవినీతి పరునిగా జగన్ ను అభివర్ణించారు. అటువంటి వ్యక్తికి పేదలు.. పెత్తందార్లు అంటూ మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి నోటి నుంచి విన్న క్లాస్ వార్ వంటి పదాలు.. జగన్ రెడ్డికి సూటు కావని ఎద్దేవా చేశారు. అసలు అలాంటి మాటలు మాట్లాడటానికి జగన్ కు అర్హతే లేదని తేల్చి చెప్పారు. మొత్తం మీద పాపం పసివాడు.. నోట్లో వేలు పెడితే కొరకలేడు అంటూ జగన్ రెడ్డిపై పవన్ చేసిన ట్వీట్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్‌కు వెళ్ళిన సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.