పొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని ఓడిస్తాం..!!

పొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని ఓడిస్తాం..!!

“2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించటం ఖాయం.. పొత్తులు పెట్టుకోవటం కూడా అంతకన్నా ఖాయం”.. ఇదీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాట. జనసేన, టీడీపీ పొత్తులపై గత కొంత కాలంగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే తన లక్ష్యమన్న ఆయన.. వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. సీఎం పదవి ఇస్తేనే పొత్తులు పెట్టుకోవాలనే భేషజాలు తనకు లేవన్న పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల నుంచే బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పారు.

సీఎం పదవి లేకుండా పొత్తులు ఎలా పెట్టుకుంటారంటూ..? కొంత మంది చేస్తున్న వితండవాదం సరైంది కాదని అభిప్రాయ పడ్డారు.ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసని.. చేతిలో కనీసం 30 ఎమ్మెల్యే సీట్లు కూడా లేకుండా సీఎం పోస్టు ఎలా ఆశిస్తామని వ్యాఖ్యానించారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును.. ఆయన నివాసంలోనే కలిసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. దీంతో.. వారిద్దరూ ఏ విషయాలపై మాట్లాడారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజా ప్రెస్ మీట్ అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పొత్తులపై కన్ఫ్యూజన్‌లో ఉన్న జనసైనికులకు సైతం.. దిశా నిర్దేశం చేసింది. పొత్తులపై సుదీర్ఘంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసైనికులు పని చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా తెర దించే ప్రయత్నం చేశారు. బీజేపీనో.. టీడీపీనో తాను సీఎం పదవి అడగబోనని ప్రకటించారు. ఎమ్మెల్యేల బలం లేకుండా షరతులు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పొందలేమని స్పష్టం చేశారు. ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి కనీసం 30 స్థానాలు ఇచ్చి ఉంటే సీఎం రేసులో ఉండేవాడిన్నారు. కానీ.. అలా జరగలేదు కాబట్టి.. రాబోయే రోజుల్లో వాస్తవ దృక్పధంతోనే ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రం చీలబోనివ్వనని తేల్చి చెప్పారు.

ఇక.. పొత్తులపై బీజేపీ కూడా సానుకూలంగా ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పానన్న జనసేనాని.. వారు తగు విధంగా స్పందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ బీజేపీ రాకపోయినా ఏపీలో పొత్తులు ఆగవన్న విధంగా వ్యాఖ్యానించారు. దీంతో అటు వైసీపీతో.. ఇటు జనసేనతో డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ నాయకత్వం ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్న బీజేపీ నేతలు.. చంద్రబాబు పైకి జనసేనను ఉసిగొల్పాలని చూస్తున్నారు. కానీ జనసేనాని మాత్రం.. టీడీపీ తోనే వైసీపీ ఓటమి సాధ్యమని భావిస్తున్నారు. సో.. ఈ క్రమంలో బీజేపీ కలిసి వచ్చినా.. రాకపోయినా.. టీడీపీతో పొత్తు ఖాయమనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దీంతో.. బంతి బీజేపీ కోర్టులో పడినట్టు అయ్యింది. మరోవైపు.. సీఎం పదవిని అడ్డుపెట్టి టీడీపీ, జనసేన పొత్తు చెడగొట్టాలనే ప్రయత్నాలకు సైతం పవన్ తాజా వ్యాఖ్యలతో బ్రేక్ పడినట్టయ్యింది.

మొత్తం మీద 2024 ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖాయమనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా అర్ధం అవుతోంది. అంటే.. గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ద్వారా లాభపడ్డ వైసీపీకి ఈసారి గడ్డు పరిస్థితి ఎదురుకానుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *