పవన్ కళ్యాణ్ OG కి ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్..!

పవన్ కళ్యాణ్ OG కి ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే అని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో వినోదయ్య సీతమ్ రీమేక్ షూటింగ్ పూర్తి అవ్వగా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఇక సాహో సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రం షూటింగ్ మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు.

‘ఓజీ’ అండ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఓజీ కోసం ఇటీవలే ముంబై షెడ్యూల్ ను ముగించుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ కు హాజరు అయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం .

ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల్లో సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ చిత్రం పై అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా సాహో రేంజ్ లో స్టైలిష్ మూవీగా.. పాన్ ఇండియా యాక్షన్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని కూడా అభిమానులు చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.

ఎంత భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా అప్డేట్స్ కూడా సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఓజీ కి ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సందడిని చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సూపర్ అప్డేట్స్ ను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ఒక తమిళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అని తెలిసిందే . ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ గా శ్రీలీల దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *