#pspk వినోదయ సీతం ..రిలీజ్ డేట్ ఫిక్స్..

#pspk వినోదయ సీతం ..రిలీజ్ డేట్ ఫిక్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలతో కుస్తీ పడుతూనే.. మరోవైపు షూటింగ్స్ తో బిజీబిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సాయి ధరమ్ తేజ్ తో కలిసి.. తమిళ రీమేక్ సినిమా వినోదయ సీతం లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఒరిజినల్ తమిళంలో దర్శకత్వం వహించిన సముద్ర ఖని.. తెలుగు వర్షన్ కు కూడా ..డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో వేగంగా జరుగుతోంది. మామ, మేనల్లుడు కలిసి చేస్తున్న ఈ మొదటి సినిమాపై మెగా ఫ్యాన్స్ అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించారు. అంటే.. మూడు వారాల్లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ భాగాన్ని మొత్తాన్ని ఈ చిత్ర బృందం ముగించడానికి ఇప్పటికే సన్నాహాలు చేసింది.

తమిళ మాతృక వినోదయ సీతం మూవీ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో అనేక మార్పులు … చేర్పులను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ లో సాయి తేజ్ కు ఒక హీరోయిన్ ఉండబోతున్నట్లు … అలాగే ఈ మూవీ లో రెండు పాటలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. వినోదయ సీతం మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. జూలై 28వ తేదీన.. వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున అన్ని థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వినోదయ సీతం లో కేతికా శర్శ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇంకా మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, రాజా, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ తో పాటు వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ, కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. తెలుగు వెర్షన్ కోసం డైలాగ్స్ రాస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఈ మెగా మల్టీస్టారర్ మూవీపై అప్పుడే అంచనాలు.. తారాస్థాయిలో నెలకొన్నాయి.

ఇక పవన్ కల్యాణ్ వినోదయం సీతంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం కంటే.. ముందే .. వినోదయ సీతం చిత్రం విడుదల అవబోతుండడం విశేషం. గత నెల ఫిబ్రవరి లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఈ మధ్యనే లీకైన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల వర్కింగ్ స్టిల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ గోపాల గోపాల మూవీలో లాంటి పాత్ర చేస్తున్నారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. జూలై 28న వినోదయ సీతం చిత్రం రిలీజ్ డేటు అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఖుషీలో మునిగిపోయారు.

 

Related post

ఆ 40 నిమిషాలు జైల్లో ఏం జరిగింది?

ఆ 40 నిమిషాలు జైల్లో ఏం జరిగింది?

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలేం జరిగింది..? పవన్ కళ్యాణ్ ఎందుకంత హడావుడిగా పొత్తుపై ప్రకటన చేశారు? ఇవే అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.…
బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కీలక ప్రకటన

టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కీలక ప్రకటన

వైసీపీపై యుద్ధం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన చేశారు. రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *