
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: ఎంపీ రామ్మోహన్ నాయుడు
- Ap political StoryNewsPolitics
- April 26, 2023
- No Comment
- 26
నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరమని తద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పోలాకి మండలం అక్కువరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఆధ్యాత్మిక చింతన కొనసాగిన నాడు ఆయా గ్రామాలలో ప్రశాంతతతో పాటు ఐక్యమత్యం కూడా కలుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.