“పెదకాపు-1” ఫస్ట్ లుక్ పోస్టర్..అడ్డాల ఇచ్చిపడేశాడు!

“పెదకాపు-1” ఫస్ట్ లుక్ పోస్టర్..అడ్డాల ఇచ్చిపడేశాడు!

శ్రీకాంత్ అడ్డాల అప్ కమింగ్ మూవీ “పెదకాపు- 1” ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి “పెదకాపు- 1” అనే టైటిల్ ఖరారు చేయడం విశేషం. ఈ చిత్రంతో  విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మాస్ ఫర్మాఫర్మెన్స్ తో ఉన్న  టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ ప్రదర్శించిన శ్రీకాంత్ అడ్డాల…ఆ తర్వాత ఆస్థాయిలో మెప్పించలేకపోతున్నారు. నారప్పతో కాస్త హడావుడి చేసినా, బ్లాక్ బస్టర్ కొట్టేందుకు  ఈసారి పక్కా మాస్ స్టోరీతో వస్తున్నాడు.

“పెదకాపు-1”  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో విరాట్ కర్ణ ఇంటెన్స్ లుక్‌ ఆకట్టుకుంటోంది. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు విరాట్ కర్ణ. అతని చుట్టూ జనసంద్రం కనిపిస్తోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ భారీ అంచనాలు పెంచుతోంది. ఓ సామాజికవర్గాన్ని బేస్ చేసుకొని శ్రీకాంత్ ఈ చిత్రాన్ని తెరకిక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అందులో వన్ అనే నంబర్ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *