మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకలో ఇష్టారాజ్యం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకలో ఇష్టారాజ్యం

అక్కడ తాము చెప్పిందే వేదం. చేసిందే చట్టం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు పెద్దిరెడ్డి బ్రదర్స్. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకలో నిబంధనల ఉల్లంఘన యథేశ్చగా జరుగుతోంది. కోర్టులు, ట్రైబ్యునళ్లను కూడా లెక్కచేయడం లేదు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న పుంగనూరు నియోజకవర్గంలోని ఆవులపల్లి, నేతిగుట్లపల్లె.. ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ముదివేడుల్లో …బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణంలో నిబంధనలకు పాతరేశారు.

ప్రాజెక్టుల నిర్మాణంతో సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే పనులు మొదలుపెట్టారు. అయితే, ఎక్కడి పనులు అక్కడ ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందని ప్రభుత్వానికి ఎన్జీటీ ఏకంగా 100 కోట్ల జరిమానా విధించినా బేఖాతరు చేస్తున్నారు. రిజర్వాయర్ల పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలకు గాను…ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది.

ఎన్జీటీ విధించిన 100 కోట్ల జరిమానాపై పాక్షికంగా స్టే విధిస్తూ… 25 కోట్ల రూపాయాలను ఎనిమిది వారాల్లోగా కష్ణానదీ యాజమాన్య బోర్డుకు జమచేయాలని జగన్ సర్కార్ ను ఆదేశించింది. మొత్తం మీద.. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో జరుగుతున్న అక్రమాలతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండతోనే పెద్దిరెడ్డి గ్యాంగ్ అరాచకాలకు పాల్పడుతోందనే అభిప్రాయం బాధితుల నుంచి వినిపిస్తోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *