జగన్ బ్రాండ్లు కొనలేక నాటు సారా వైపు మందుబాబుల చూపు

జగన్ బ్రాండ్లు కొనలేక నాటు సారా వైపు మందుబాబుల చూపు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాటు సారా కంపు కొడుతోంది. కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది.. జగన్ బ్రాండ్లు కొనలేక నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఏజన్సీ గ్రామాలు, గోదావరి లంకలు.. సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలు.. కొల్లేరు దిబ్బలు.. సెలయేటి గట్లు.. పిల్ల కాలువ మాటున బట్టీలు పెట్టి రాత్రిళ్లు నాటు సారా కాస్తున్నారు. అటవీ ప్రాంతాలు, గోదారి ఇసుక తిన్నెలు, గడ్డివాముల్లో కప్పిపెడుతున్నారు. డిమాండ్‌ మేరకు గ్రామాల్లోకి తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. అక్రమార్జన కోసం కొందరు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. దీనంతటికీ జగన్ నిర్వాకమే కారణం. పాదయాత్రలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. పిచ్చి పిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటూ పోయారు. దాంతో, నాటు సారా బాట పడుతున్న మందుబాబులు తమ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.

ప్రజల ప్రాణాలంటే ఈ పాలకులకు లెక్కలేకుండా పోయింది. ఈ నయవంచక పాలన, అధిక మద్యం రేట్ల కారణంగానే ఏపీలో నాటు సారా దందా యథేశ్చగా సాగుతోందనేది జగమెరిగిన సత్యం . ఏపీలో నాటు సారాను ఓ కుటీర పరిశ్రమగా మార్చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. ఎక్కడ చూసినా సారా బట్టీలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. కళ్లముందు సారా మరణాలు కనిపిస్తున్నా ఈ గుడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా జరిగిన కారణంగా 18 మంది ఒకేసారి మరణించారు. ఆ విషాదం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంది. వీరంతా కూడా కల్తీ సారా తాగే చనిపోయారు. కానీ సర్కార్ పెద్దలు అలాంటిదేమీ జరగలేదంటూ పేదల ప్రజల ప్రాణాలను లైట్ తీసుకున్నారు.

గతంలో బ్రాందీ షాపులు సిండికేట్ల చేతుల్లో ఉన్నప్పుడు సారాను ఆపేందుకు ప్రయత్నాలు జరిగేవి. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు కూడా కదిలేవారు. కానీ ఇప్పుడు రైడ్స్ జరగడం లేదు. పట్టణంలోనే సారా అమ్మకాలు చాలా పెరిగాయి. అధికార పార్టీ నేతల అనుచరులలోనే ఇలాంటి సారా వ్యాపారులు ఉన్నారు. దాంతో, సారా వ్యాపారం జగన్ పాలనలో దినదినం వర్థిల్లుతోంది. తమ అక్రమార్జన కోసం కల్తీగాళ్లు ప్రమాదకరమైన రసాయనాలు కలిపేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వహిస్తోంది.

ఒక వైపు గంజాయి, మరో వైపు మాదక ద్రవ్యాలు…. ఇంకో వైపు నాటు సారా ఇలా ఏపీని మత్తులో ముంచెత్తుతూ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నారు జగన్. పాదయాత్రలో ఇచ్చిన ఘనమైన వాగ్దానం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని వెక్కిరించేలా ఇవన్నీ పెరిగిపోయాయి. అందుకే సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని జనం కోరుకుంటున్నారు.

Related post

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…
జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ లో ఎందుకింత రాక్షసత్వం ఆవహించింది. అసలు ఆయన రాజకీయ అరంగేట్రమే అవినీతితో మొదలైందని అంటారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43వేల కోట్లు వెనకేసుకున్నాడని..సీబీఐ నిర్ధారణ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *