లోకేష్ దృష్టికి పలు గ్రామాల సమస్యలు

లోకేష్ దృష్టికి పలు గ్రామాల సమస్యలు

డోన్ నియోజకవర్గం నల్లమేకలపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామమంతా బోర్ల కింద వ్యవసాయం చేస్తున్నాం. గ్రామంలోని చెరువుకుంట శిథిలావస్థకు చేరుకుంది. దీనికి మరమ్మతులు చేయాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. చెరువు కుంటలో నీళ్లుంటేనే బోర్లకు నీరు పుష్కలంగా అందుతుంది. వ్యవసాయం బాగుంటుంది, పశువులకు నీటి ఎద్దడి లేకుండా ఉపయోగకరంగా ఉంటుంది.

చెరువుకుంట మరమ్మతులు చేయించి ఆదుకోవాలని కోరుతున్నాం. అని లోకేష్ కు చెప్పారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు సబ్సిడీలు, యంత్ర పరికరాలు అందించి అండగా నిలిచాం. రాయలసీమలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఇక్కడి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం రూ.11వేల కోట్లరూపాయలు ఖర్చుచేసింది. మేం అధికారంలోకి వచ్చాక చెరువుకుంట కు మరమ్మతులు చేయిస్తాం. నల్లమేకలపల్లిలో వ్యవసాయం, పశువులకు నీటి సమస్యలేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

పి ఆర్ పల్లి గ్రామస్తుల విన్నపం

తెలుగుదేయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను డోన్ నియోజకవర్గం పిఆర్ పల్లి గ్రామస్తులు కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉంది. ఇళ్ల ముందు మురికి నీరు నిల్వ ఉండడం వల్ల అనునిత్యం అనారోగ్యం పాలవుతున్నాం. వర్షాకాలమొస్తే మా పరిస్థితి దారుణం. కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు లేవు. అధికారలోకి వచ్చాక డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలని కోరుతున్నాం. మంచి నీటి బోర్లు సరిపడా లేక తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. మాకు 10కిలోమీటర్ల దూరంలో కాలేజీలు ఉన్నాయి. అంత దూరం వెళ్లలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు.

జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి. టీడీపీ పాలనలో మంజూరైన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపేసింది. మీరు అధికారంలోకి వచ్చాక బిల్లులు విడుదల చేయించాలి అని కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టీడీపీ పాలనలో ప్లానింగ్ కమిషన్ నిధులను సద్వినియోగం చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. కనీసం రోడ్లపై తట్టిమట్టి పోసిన దాఖలాలు లేవు. మేం అధికారంలోకి వచ్చాక పిఆర్ పల్లిలో డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్లు నిర్మిస్తాం. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అందిస్తాం. జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. టీడీపీ పాలనలో మంజూరై బిల్లలు ఆపేసిన ఇళ్లకు బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *