వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : లచ్చుమర్రి గ్రామస్తులకు నారా లోకేష్ హామీ

వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : లచ్చుమర్రి గ్రామస్తులకు నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. టీడీపీ పాలనలో మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పుష్కలంగా నీరందేది. నేడు మోటార్లు పనిచేయక, నీరందక, వ్యవసాయం నష్టదాయకంగా మారింది. ఇళ్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో కేటగిరి మారి అధికంగా వస్తోంది. వంక పక్కన మాకు ఇళ్లు ఇవ్వడంతో వరదల సమయంలో ముంపుకు గురవుతున్నాం.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలో సిసి రోడ్లు, వీధి లైట్లు వేయలేదు. తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. తుంగభద్ర నది పక్కనే ఉన్నా మాకు ఇసుక దొరకడం కష్టంగా మారింది. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించండి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రైతులను ఆదుకునేందుకు టిడిపి హయాంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడుబెట్టింది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు, 30లక్షల తాగునీటి కుళాయిలు ఇచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *