రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు: పిల్లి మాణిక్యరావు

రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు: పిల్లి మాణిక్యరావు

జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని భూముల్ని పంచభక్ష పరమాన్నాలుగా భుజిస్తు న్నాడని, ముఖ్య మంత్రికి భూములంటే ఎంతో మోజని, వై.ఎస్‌.రాజారెడ్డి మైన్స్‌ ఉన్న వ్యక్తిని చంపి, అతని భూముల్ని లాక్కుంటే, అతని బాటలోనే మనవడు జగన్‌ నడుస్తున్నాడని, విజయసాయి రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల వంటి వారి సాయంతో రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు చేస్తున్నాడని, టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తన భూముల స్వాహాలో భాగంగా జగన్‌ చుక్కల భూము లకు ఎసరుపెట్టాడు. ఆ భూముల్ని సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ దారులకు చుక్కలు చూపిస్తున్నారో, వైసీపీ భూకబ్జాదారులకు చుక్కలభూముల్ని, దేవాదాయభూముల్ని అప్పనంగా కట్టబెడుతున్నారో ప్రభుత్వం సమా ధానం చెప్పాలి.

జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు అన్యా క్రాంతమయ్యాయి. భూములు సాగు చేసుకుంటున్నవారిని భయపెట్టి అధికారులసాయంతో ఆభూముల్ని వైసీపీనేతలు వారిపేర్లతో రికార్డుల్లోకి ఎక్కించుకున్న ఘ టనలు కోకొల్లలు. విశాఖపట్నం చుట్టుపక్కల విజయసాయి మొదలు వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా అయినకాడికి భూముల్ని స్వాహా చేశారు. వైసీపీ గ్రామస్థాయి నేతనుంచి రాష్ట్రస్థాయి నేతవరకు అందరూ భూకబ్జాల్లో ముని గితేలుతు న్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వందలఎకరాల భూమిని కబ్జా చేసినట్టు టీడీపీయువనేత నారాలోకేశ్‌ మొన్ననే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా బయటపెట్టాడు. ప్రజలముందు తానేదో పెద్ద నీతిమంతుడిలా పోజులుకొట్టే కేతిరెడ్డి, లోకేశ్‌ కు సమాధానంచె ప్పలేక పిచ్చిప్రేలాపనలు పేలుతున్నాడు.

కేతిరెడ్డి బాటలోనే మంత్రి ఉషశ్రీచరణ్‌ అనంతపు రం జిల్లా కనగానపల్లెలో 160ఎకరాలు ఆక్రమించారు. జగన్మోహన్‌ రెడ్డి వేల ఎకరాలు భూ కబ్జాలుచేస్తుంటే, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, బంధువులు వారివారిస్థాయిల్లో అయిన కాడికి హాంఫట్‌ చేస్తున్నారని అన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *