మత్స్యకార సంక్షేమంపై పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్‌

మత్స్యకార సంక్షేమంపై పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్‌

తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యులు గా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉన్న సమయంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో రెండు మండలాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టామని, అందులో ముఖ్యంగా 14 కోట్ల నిధులతో 7 తుఫాన్‌ షెల్టర్లు నిర్మించామని తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్‌ పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి తెలిపారు.

విడవలూరు మండలం రామచంద్రాపురం పాతురులో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిర్మించిన తుఫాన్‌ షెల్టర్‌ వద్ద సెల్ఫీ తీసుకుని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డికి చర్చ కోసం ఛాలెంజ్‌ చేశారు. మొట్టమొదటి సారిగా మత్స్యకార పించేన్లు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ లో అడిగిన శాసన సభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అయితే మంజూరు చేసింది నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. వేట నిషేధం సమయంలో అందరికీ బృతి, సాంకేతిక పరికరాలు, వలలు, బోట్లు, డీజల్‌ సబ్సిడీ, వ్యాపారం కోసం వాహనాలు, సబ్సిడీ లోన్లు ఇచ్చి ఆడుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు.

ఈ నాలుగేళ్ల పాలనలో ప్రసన్న కుమార్‌ రెడ్డి ఎన్ని తుఫాన్‌ షెల్టర్లు కట్టించారు, ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఎక్కడైనా సాంకేతిక పరికరాలు, వలలు ఎన్ని ఇచ్చారో తెలిపే దమ్ము ఉందా అని సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు. మరో అభివృద్ధి కార్యక్రమం వద్ద సెల్ఫి ఛాలెంజ్‌ తో కలుసుకుందామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, పార్లమెంట్‌ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఆవుల రవీంద్ర, నియోజకవర్గ మత్సకార అధ్యక్షుడు ఆవుల రవీంద్ర బాబు, నరేష్‌, శీనయ్య, మండల బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చిన్ని బాబు, మండల పార్టీ కార్యదర్శి ఆవుల రామ చంద్రయ్య, పార్లమెంట్‌ మత్స్యకార కమిటీ కార్యదర్శి రంగాంగారి వెంకటేశ్వర్లు, కొండూరు పోలయ్య, నరసింహ, మాజీ సర్పంచ్‌ ప్రబాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *