
చంద్రబాబుకు అండగా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం
- Ap political StoryNewsPolitics
- September 16, 2023
- No Comment
- 13
నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై కుట్ర పూరిత కేసులతో .. వైసీపీ సర్కార్ ఇబ్బందులు పెడుతోంది. ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసనగా, చంద్రబాబుకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చేందుకు.. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు వెంటనే విడుదల చేయాలంటూ.. దీక్షలతో పాటు సంతకాల సేకరణ, ప్రార్ధనలు, పూజలు, మహిళల ఆశా జ్యోతి వంటి పలు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై… మాజీ మంత్రి పొంగూరు నారాయణ .. మెడికల్ కాలేజీ క్యాంప్ కార్యాలయంలో డివిజన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ నాయకుడు చంద్రబాబుకు అండగా నిలవాలని…ఆయన్ని విడుదల చేసేంత వరకు.. నేతలంతా కలిసి కట్టుగా పోరాడాలని నారాయణ.. దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.