
సల్మాన్ తో డేటింగ్.. పూజ రియాక్షన్ ఇదే..!
- EntertainmentMoviesNews
- April 14, 2023
- No Comment
- 34
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ” కిసి కా భాయ్ కిసి కి జాన్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో సల్మాన్ తో పాటుగా విక్టరీ వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా చేస్తున్న టైం లో సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్దే ప్రేమలో పడిందని ప్రస్తుతం వారిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వచ్చాయి.
ఆ వార్తలపై రెస్పాండ్ అయ్యింది పూజా హెగ్దే. సల్మాన్ ఖాన్ తో తను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది పూజా హెగ్దే. సినిమాలో సల్మాన్ లవర్ గా కనిపిస్తా సల్మాన్ ఖాన్ కి నేను పెద్ద అభిమానిని కానీ ఆయనతో డేటింగ్ లో లేనని చెప్పింది పూజా హెగ్దే. ఐతే సౌత్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉండటం అది ఒక తెలుగు నేటివిటీకి దగ్గరగా స్టోరీ ఉంటుందని ఆ స్టోరీ తగ్గట్లుగానే మా క్యారెక్టర్స్ ఉంటాయని , అంతే తప్ప నో డేటింగ్ .. నథింగ్ అని చెప్పేసింది పూజ ,ప్రస్తుతం తాను సోలోగానే ఉన్నానని ఎవరి ప్రేమలో లేనని చెప్పింది బుట్ట బొమ్మ. తను ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానని లవ్ చేసేంత టైం లేదని చెప్పుకొచ్చింది.
తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది పూజా హెగ్దే. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన క్రేజీ ఛాన్స్ లు అందుకుంటున్న పూజా హెగ్దే హిందీలో కూడా పాగా వేయాలని అనుకుంటుంది. కెరీర్ మొదలు పెట్టింది అక్కడే బట్ హృతిక్ తో నటించిన మొహంజోదారో సినిమా ప్లాప్ అవడంతో అమ్మడికి అక్కడ పెద్దగా క్రేజ్ రాలేదు. ఫైనల్ గా సౌత్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని మళ్లీ బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తుంది పూజా హెగ్దే. చూడం అమ్మడి కోరిక తీరుతుందేమో .