
పవన్ కళ్యాణ్ పై మరోసారి పూనమ్ కౌర్ ఫైర్.. ఎందుకంటే..?
- EntertainmentNews
- May 11, 2023
- No Comment
- 34
పూనమ్ కౌర్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ వివాదాలతో ట్రావెల్ చేస్తూ వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్ తాజాగా పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో వేలుపెట్టింది. నెట్టింట ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండ్ నడుస్తున్న వేళ.. కాంట్రవర్సీ కామెంట్ చేసింది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్‌తో ట్విట్టర్ మొత్తం మోత మోగుతోంది. అందుకు తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చేలా పోస్టర్స్ వదులుతూ ఆసక్తి రేపారు హరీష్ శంకర్. అయితే తాజాగా బయటకొచ్చిన ఓ పోస్టర్ పై పూనమ్ కౌర్ అటాక్ చేసింది.
కొత్తగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కాళ్ల కింద.. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ పెట్టడాన్ని తప్పుబట్టింది పూనమ్. ఇది కచ్చితంగా భగత్ సింగ్ ను అవమానించడం లాంటిదే.. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. స్వతంత్ర సమరయోధులను గౌరవించకపోయినా కనీస మర్యాద అయినా ఇవ్వాలి.. కానీ ఇలా కించపర్చకూడదు.. ఆయన పేరుని.. నీ కాలి బూటు వద్ద పెట్టుకుంటావా?.. ఇది అహంకారమా? లేక నిర్లక్ష్యమా? అంటూ పూనమ్ కౌర్ కామెంట్స్ చేయడం దుమారానికి దారి తీసింది. పూనమ్ చేసిన ఈ ట్వీట్లపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ అవుదామని ఇండీస్ట్రీకి వచ్చిన పూనమ్ కౌర్.. ఆశించిన మేర అవకాశాలు అందుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మోసపోయానంటూ వివాదాలతో సావాసం చేస్తున్న ఈ బ్యూటీ.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయమై పెడుతున్న పోస్టులు పలు చర్చలకు తావిస్తుంటాయి. తాజాగా అదే రిపీట్ అయింది.