తెలంగాణలో పవర్ పాలిటిక్స్

తెలంగాణలో పవర్ పాలిటిక్స్

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పవర్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. రోజుకు 8గంటల విద్యుత్ చాలన్న రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఇరుకునపడింది. బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడం, పోటీగా కాంగ్రెస్ ఆందోళనలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే కళ్ల మంట ఎందుకంటే… గులాబీ నేతలు కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేస్తున్నారు. రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే, అంతేస్థాయిలో హస్తం శ్రేణులు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అంటోంది. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే 24గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెబుతోంది.

కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలు వక్రీకరించి రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన ఉచిత విద్యుత్ నే కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారని తిప్పికొడుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు రుజువుచేస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఎంపీ కోమటిరెడ్డి సవాల్ చేశారు.

రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ?3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ?అంటూ కేటీఆర్ ట్వీట్ వదిలారు. కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *