
ప్రాజెక్ట్ K – మరో గ్రహంలోకి..
- EntertainmentMoviesNews
- April 14, 2023
- No Comment
- 30
ప్రాజెక్ట్ k యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ తగ్గ మూవీ గా అనిపిస్తుంది ఎందుకంటే , హాలీవుడ్ లో ఎక్కువగా భూమిపైన కాకుండా విశ్వంలో మరో గ్రహంపై జరిగే కథలని చూపిస్తూ ఉంటారు. మార్వేల్ సిరీస్ లో ఎక్కువగా ఇలాంటి అవుట్ ఆఫ్ ది వరల్డ్ కథలని ఆవిష్కరిస్తూ ఉంటారు. అలాగే ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు చాలా ఉంటాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అలాంటి గ్రహాలు సౌర కుటుంబంలో కాని మరొక నక్షత్ర మండలంలో గాని ఉన్నాయా అనే విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
అయితే ఈ పరిసోధనలపై ఇప్పటికి ఒక స్పష్టత రాలేదు. భూమిని పోలిన గ్రహాలు గురించి కనిపెడుతున్న అవి మానవ ఆవాసానికి ఉపయోగపడతాయా అంశాన్ని నిర్ధారించలేకపొతున్నారు. దీనికి కారణం అలాంటి మరో గ్రహానికి వెళ్ళాలంటే కాంతితో సమానంగా ప్రయాణం చేసే వాహనాలు ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇప్పట్లో అది సాధ్యం కాదు.
అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఇలాంటి అంశాలని దర్శకుడు నాగ్ అశ్విన్ టచ్ చేయబోతున్నరంట. మూడో ప్రపంచ యుద్ధం కారణంగా భూమి మానవ నివాసానికి పనికిరాకుండా పోతుంది. ఈ నేపధ్యంలో భూమిని పోలిన మరో గ్రహంపైకి ప్రభాస్ తన టీమ్ తో వెళ్తాడంట. అలా వెళ్ళిన తర్వాత వారు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నారు అనే అంశాలని మూవీలో చూపించాబోతున్నారు అనే ప్రచారం నడుస్తోంది.
నాగశ్విన్ చేస్తుంది సాహసమే అని చెప్పాలి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అని తెలిసినప్పటికీ . గతం లో వచ్చిన అవతార్ లాంటి మూవీస్ సూపర్ సక్సెస్ ఐయ్యాయి మరి తెలుగు లో ఆ క్వాలిటీ వస్తుందా అని డౌట్స్ ఉన్నప్పటికీ నాగశ్విన్ కాన్సెప్ట్ కొంచం భిన్నంగానే ఉంటుంటున్నారు. ఈ నేపధ్యంలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె లో కూడా ఇలాంటి అవుట్ ఆఫ్ ది వరల్డ్ ని చూపించబోతున్నారని తెలుస్తుంది . దానికోసమే కాంతితో సమానంగా ట్రావెల్ చేసే వాహనాలు కూడా సినిమాలో ఉంటాయని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది సినిమా నుంచి టీజర్ బయటకి వచ్చేంత వరకు తెలియదనే చెప్పాలి. అయితే నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కె నుంచి కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. హ్యాండ్స్ తోనే సరిపెట్టాడు. దీపికా పదుకునే అమితాబచ్చన్ దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ మూవీలో ఉన్న కూడా వారిని ఎక్కడా రివీల్ చేయడం లేదు .