విద్యార్థుల నిరసనతో హోరెత్తిన.. ద్రావిడ విశ్వవిద్యాలయం

విద్యార్థుల నిరసనతో హోరెత్తిన.. ద్రావిడ విశ్వవిద్యాలయం

కుప్పం నియోజకవర్గంలోని ద్రావిడ యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకి పోయింది. వర్శిటీలో సిబ్బంది జీతాలు అందక సమ్మెలో పాల్గొనడంతో.. విద్యార్థుల జీవితాలు రోడ్డుపై పడ్డాయి. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై .. తరగతులు బహిష్కరించి.. నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. ద్రావిడ వర్శిటీ లోని రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వర్శిటీ హాస్టల్ లో తాగునీరు లేక మరుగుదొడ్లు లేక.. వసతుల లేమితో అనేక ఇబ్బందులు పడుతున్నామని ద్రావిడ వర్సిటీ విద్యార్థులు తెలిపారు. మరుగుదొడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని .. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయకపోవడంతో విపరీతమైన కంపు వస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా హాస్టల్ లో కూడా .. సరైన పౌష్టికాహారం కూడా అందడం లేదని..విద్యార్థులు వాపోయారు.

ద్రావిడ వర్శిటీ వీసికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదని విద్యార్థులు మండిపడ్డారు. వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వీసీపై .. చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఇదేనా వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమం అని ప్రశ్నించారు. ఇలాంటి హాస్టల్స్ లో విద్యార్థులను ఎలా ఉంచుతున్నారని విద్యార్థులు తమ ఆక్రోశం వ్యక్తం చేశారు. లెక్చరర్లు.. కనీసం విద్యా సంవత్సరం సంబంధించిన సిలబస్ కూడా చేయడం పూర్తి చేయకపోవడంతో .. ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కానీ.. అధికారులు కానీ.. వర్శిటీలోని వసతి గృహాలను సందర్శించి.. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వర్శిటీలోని అన్నిసమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఉధృతం చేస్తామని విద్యార్థులు తెలిపారు.

విద్యార్థుల ఆందోళనతోనైనా.. వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు సూచించారు. అధికారులు స్పందించకుంటే.. వసతి గృహాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం .. ఎందాకైనా వెళ్తామని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తీరుస్తామని.. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలు ఇవ్వకపోతే .. ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు తెలిపారు. ద్రావిడ వర్శిటీ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు .. ఆందోళన ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *