
పులివెందుల్లో రెచ్చిపోయిన అరాచక శక్తులు
- Ap political StoryNewsPolitics
- March 29, 2023
- No Comment
- 63
సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో అరాచక శక్తులు మరోసారి రెచ్చిపోయాయి. జగన్ రెడ్డి బంధువు, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు భరత్ కుమార్ యాదవ్ కాల్పులకు తెగబడ్డాడు. మట్కా లావాదేవీల్లో తేడాలు రావడంతో భరత్ కుమార్ యాదవ్ ఇద్దరు వ్యక్తులపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్ చనిపోయాడు, మరో బాధితుడు బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ కు, భరత్ కుమార్ యాదవ్ సమీప బంధువు కావడం విశేషం.
గతం ప్రభుత్వ హయాంలో భరత్ కుమార్ యాదవ్ గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత భరత్ కుమార్ యాదవ్ కు గన్ లైసెన్స్ ఇచ్చారు. భరత్ కుమార్ యాదవ్ గతంలోనూ అనేక మందిపై గన్ ఎక్కుపెట్టి సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఇటీవల పులివెందుల సమీపంలోని నల్లపురెడ్డిపల్లె ఎంపీటీసీ విశ్వనాథరెడ్డిని కూడా భరత్ కుమార్ యాదవ్ గన్ తో బెదిరించాడు. అయితే వారు తిరగబడి దాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అరాచకాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు గన్ లైసెన్స్ ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.