
చీరకట్టుతో అమ్మవారిలా అల్లు అర్జున్..
- EntertainmentMoviesNews
- April 8, 2023
- No Comment
- 41
స్టయిలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం పుష్ప 2 నుంచి వేర్ ఈజ్ పుష్ప అనే వీడియోతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ లుక్ చాల కొత్తగా ఉంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకు కారణం.. పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రూ.300 కోట్ల మేరకు వసూళ్లు సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ సినిమా తెరకెక్కుతోంది.
ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టుగానే సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. ఏప్రిల్ 7న పుష్ప 2 ది రూల్ సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అనే వీడియోను విడుదల చేశారు. రిలీజ్ చేసిన 1 హౌర్ లోనే మిలియాన్స్ లో వ్యూస్ వచ్చాయీ , అందులో హీరోను చివరి ఐదు సెకన్లు మాత్రమే అల్లు అర్జున్ కనిపించాడు. మిగతాదంతా తన క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రమే కనిపిస్తుంది.
ఈ వేడి చల్లారక ముందే పుష్ప 2 టీమ్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అదే ఫస్ట్ లుక్. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అందుకు కారణం.. ఐకాన్ స్టార్ అందులో సరికొత్త లుక్‌లో కనపడటమే. ఇంతకీ ఏంటా లుక్ అని అనుకుంటున్నారా? అమ్మవారి లుక్‌లాగా అనిపిస్తుంది. శరీరం అంతా నీలం కలరు.. చీరకట్టు, చేతికి గాజులు వేసుకున్న బన్నీ ఓ చేతిలో గన్ పట్టుకుని నిలుచుకన్నాడు. అసలు అమ్మవారిగా అల్లు అర్జున్ ఏంటనే సందేహం రాక మానదు.
విషయమేమంటే.. పుష్ప సినిమా అంతా తిరుపతి బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. తిరుపతిలో గంగమ్మ జాతర చాలా ఫేమస్. ఆ .జాతర జరిగే సమయంలో అమ్మ వారికి మొక్కులు ఉంటాయి. అందులో కొందరు వైవిధ్యమైన వేషధారణలు వేసుకుంటామని మొక్కుకుంటారు. ఆ క్రమంలో కొందరు మగవాళ్లు ఆడవాళ్లలాగా వేషధారణ చేసుకుంటారు. అలాగే ఈ సినిమాలోనూ అల్లు అర్జున్ అమ్మవారి వేషం వేసుకుంటాడనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ లుక్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది.