యూట్యూబ్ లో పుష్ప ది రూల్ ప్రకంపనలు

యూట్యూబ్ లో పుష్ప ది రూల్ ప్రకంపనలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ దుమ్మురేపుతోంది. పుష్పను మించి పుష్ప ది రూల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండ్రోజుల క్రితం పుష్ప ఎక్కడా? అంటూ ఓ సస్పెన్స్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్…తాజాగా బన్నీ బర్త్ డేను పురస్కరించుకొని పుష్ప ఎక్కడున్నాడో తెలిపే వీడియోను రిలీజ్ చేసింది. వేర్ ఈజ్ పుష్ప..హంట్ బిఫోర్ రూల్ అంటూ విడుదలైన పుష్ప 2 గ్లింప్స్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించినన పుష్ప సినిమా రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్.ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. కలెక్షన్ల పరంగానూ పుష్ప సునామీ సృష్టించింది. ఇప్పుడు అంచనాలకు మించి ఆసక్తికరంగా పుష్ప ది రూల్ నుండి హంటర్ ఫర్ పుష్ప అంటూ విడుదలైన కాన్సెప్ట్ వీడియో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది.

పుష్ప సీక్వెల్ లో బన్నీ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు.పుష్ప ఏమి చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెబుతున్నారు కానీ,సంపాదించిన దుడ్డు ఏమి చేస్తున్నాడో చెబుతున్నారా? లాంటి డైలాగ్స్ పుష్ప లోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి.ఇక, అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం, అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అని అర్థం” అనే డైలాగ్ తో పుష్ప క్యారెక్టర్ ను అమాంతం ఎలివేట్ చేసి ప్రేక్షకులకు కిక్ ఇచ్చారు మేకర్స్.

స్మగ్లింగ్ నేపథ్యంగా సాగే సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాడు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన సినిమాకే హైలెట్. డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్,యాటిట్యూడ్ ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అందులోని తగ్గేదేలె అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు.ఇక, చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేశారో చూశాం. ఇప్పుడు పుష్ప 2 నుంచి వచ్చిన అప్డేట్ మరింత గూస్ బంప్స్ అవుతోంది.

3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ “హంట్ ఫర్ పుష్ప” కాన్సెప్ట్ వీడియో సినిమా మీద అంచనాలను పెంచేసింది. యూట్యూబ్ లో ఈ వీడియో రికార్డ్ ల మోత మోగిస్తోంది. ఇప్పటివరకు పుష్ప 2 తెలుగు టీజర్ కు 20మిలియన్ల వ్యూస్ రాగా, అంతకుమించి హిందీ టీజర్ కు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *