టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రవీంద్ర నాయుడు

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రవీంద్ర నాయుడు

టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్య నిర్వాహక కార్యదర్శిగా పిచ్చాటూరు మండలం వేలూరుకు చెందిన రవీంద్ర నాయుడుని నియమించినట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహయాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్ర నాయుడు మాట్లాడుతూ పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్‌ బాబు, అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్‌, రమేష్‌ నాయుడు, మాధవుల నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గోపుర ప్రతిష్ట కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్‌ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నల్లబండబజారులోని జంగాల కాలనీలో బుధవారం పట్టాభి రామస్వామి ఆలయ గోపుర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్‌ ముత్తుముల అశోక్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అశోక్‌ రెడ్డి గారిని ఆలయ కమిటీ సభ్యులు పూలమాల శాలువా వేసి ఘణంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గోన్నారు.

గ్రామ కమిటీ అధ్యక్షుల ఎంపిక

కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం మేజర్‌ గ్రామపంచాయతీలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్‌ వీరభద్రయ్య హాస్పిటల్‌ ప్రాంగణంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శనివారపు మోహన్‌ రెడ్డి, క్లస్టర్‌ ఇన్చార్జ్‌ దశరథ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌ బత్యాల చెంగల్‌ నాయుడు హాజరయ్యారు. ఈ సమావేశానికి మండల పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయానికి దశదిశలు నిర్దేశించారు. 2024 ఎన్నికల్లో టిడిపి గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *