ఎంపీ రఘురామ పోటీ చేసేది ఆ పార్టీ నుంచేనా..?

ఎంపీ రఘురామ పోటీ చేసేది ఆ పార్టీ నుంచేనా..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టం రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డితో ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చాయి. విచారణ పేరుతో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామరాజును చిత్రహింసలు పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. సరిగ్గా రెండు సంవత్సరాల కిందట రఘురామరాజును హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించిన సీఐడీ అధికారులు, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఆయన ప్రతి ప్రెస్ మీట్లో గుర్తు చేస్తూనే ఉన్నారు. సీఐడీ టార్చర్ తరవాత నుంచి ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యారు. ఏపీలో అక్రమ కేసులు పెట్టటమే కాకుండా.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ఇంటిలిజన్స్ హెచ్చరికలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండాల్సి వస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన హత్యకు జరుగుతున్న కుట్రలను రఘురామ ఏకరువు పెట్టారు.

ఇక.. రాజధాని రైతుల తిరుపతి పాదయాత్ర ముగింపు సభకు హాజరైన రఘురామ వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. రెండేళ్లుగా రచ్చబండ పేరుతో జగన్ రెడ్డిపై ప్రతి రోజూ ఆయన విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే ఇంత వరకు రఘురామరాజును పార్టీ నుంచి సప్పెండ్ చేసే సాహసానికి మాత్రం వైసీపీ పెద్దలు పూనుకోలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఇక రఘురామరాజు తాజాగా రచ్చబండలో ఓ సంచలన విషయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచే పోటీ చేస్తున్నట్టు కుండబద్దలు కొట్టారు.

వైసీపీ ఎంపీ రఘురామరాజు వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. అయితే ఆయన టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఏదొక పార్టీలో చేరే అవకాశం ఉంది. టీడీపీ జనసేనలు పొత్తు దిశగా ముందుకు సాగుతున్నాయి. ఆ రెండు పార్టీలో ఏ పార్టీ టికెట్ తనకు ఆఫర్ చేస్తే, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని రఘురామరాజు స్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే బీజేపీ నుంచి పోటీ చేయడానికైనా సిద్దమేనంటూ ఎంపీ ప్రకటించారు. నరసాపురంలో ఎంపీగా గెలవడమే తన లక్ష్యమని రఘురామరాజు చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ నుంచే పోటీ చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహకారంతో జనసేన, బీజేపీల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎంపీ రఘురామరాజు నరసాపురంలో మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలతోనూ ఆయన సఖ్యతగా ఉన్నారు. ఏ పార్టీ టికెట్ ఆఫర్ చేసినా ఆయన ఆ పార్టీలో చేరి, నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో చేరేది మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా నరసాపురం ఎంపీ స్థానం ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీలో చేరేందుకు రఘురామరాజు సిద్దం అవుతున్నారు. వైసీపీ అభ్యర్థిని నరసాపురంలో ఓడించి జగన్ రెడ్డిపై కసి తీర్చుకోవాలని సమయం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ రెడ్డి బొమ్మతో గెలిచాడంటూ కొందరు వైసీపీ సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామరాజు చాలాసార్లు ఖండించారు. తాను తనబొమ్మతోనే గెలిచానంటూ చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని వచ్చే ఎన్నికల్లో నరసాపురంలో మరోసారి గెలవడం ద్వారా నిరూపించుకునేందుకు ఎంపీ రఘురామరాజు పావులు కదుపుతున్నారు. రఘురామరాజు ఏ పార్టీలో చేరతారు అనే విషయంపై మరింత స్పష్టత రావాలంటే మాత్రం అక్టోబరు వరకు ఆగాల్సిందే…

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *