సాంకేతిక అంశంతో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు

సాంకేతిక అంశంతో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు

రాహుల్ గాంధీ కుటుంబ త్యాగాలు మరిచిపోవద్దు

వ్యక్తిగత కక్షతోనే ఆయన వెంటాడుతున్నారు

ఈ పాపం ఊరికే పోదు

సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగ మేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కప్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు. రాహుల్ గాంధీ పై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్ సభ స్పీకర్ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం,ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం చేయడం అంత వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో మోడీ అధానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేసి అధికారిక నివాసం నివాసం నుండి ఖాళీ చేయించారని అన్నారు.

రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు.ఆయన తాత ముత్తాతలు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు.ఆయన ముత్తాత మోతిలాల్ నెహ్రూ అలహాబాద్ లో ఢిల్లీలో ఖరీదైన భవనాలను దేశం కోసం ఇచ్చేశారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ సైతం అనేక త్యాగాలు చేశారని రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలర్పించారని నారాయణ గుర్తు చేశారు అటువంటి కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ పై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తన ఢిల్లీ అధికారిక నివాస తాళం ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఈ పాపము ఊరికే పోదని దేశ ప్రజలు మరిచిపోరని, అలాగే కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం గమనిస్తున్నారని బిజెపికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.

Related post

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *