బీకేర్ ఫుల్ జగన్.. వైసీపీకి చుక్కలు చూపిస్తున్న రజనీ ఫ్యాన్స్

బీకేర్ ఫుల్ జగన్.. వైసీపీకి చుక్కలు చూపిస్తున్న రజనీ ఫ్యాన్స్

లెజండరీ పర్సన్. ప్రపంచం గర్వించదగ్గ నటుడు, కోట్లాది మంది ప్రజలు అమితంగా ఇష్టపడే యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్. వివాదరహితుడు. అలాంటి రజనీకాంత్ పై ఏపీలో వైసీపీ మూకలు హేయనీయమైన దాడికి పాల్పడుతున్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ పై, మంత్రులు ఇష్టమొచ్చినట్టుగా మొరుగుతున్నారు. సభ్యత, సంస్కారం మరిచి రెండ్రోజులుగా వైసీపీ నేతలు శృతిమించి చేస్తున్న విమర్శలపై… ఏపీ ప్రజలు , రజనీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీపై వైసీపీ నేతల విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జగన్ తన నోటిదూల నేతలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అటు రజనీ ఫ్యాన్స్ వైసీపీ నేతల దూషలను ఖండిస్తూ, సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పెట్టుకున్నారు వైసీపీ నేతలు. ఆయనకున్న అభిమానగణం ఒక్క తమిళనాడుకే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ ఆయన. వివాదాలకు దూరంగా ఉండే మనిషి. అలాంటి పర్సనాలిటీపై మంత్రులు, వైసీపీ నేతలు నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. భారత దేశంలో ప్రతీ పౌరునికి తన అభిప్రాయాలను వ్యక్తంచేసే మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ఉంది. అదే విధంగా విజయవాడ వచ్చిన రజనీకాంత్ సైతం చంద్రబాబుపై తనకు ఉన్న అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు. అయితే.. రజనీ వైసీపీ నేతల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా…ఎన్టీఆర్, చంద్రబాబును ప్రశంసించడాన్ని తట్టుకోలేక ఉన్మాదుల్లా రెచ్చిపోతున్నారు. పరుష పదజాలతో ధూషణలకు దిగుతున్నారు. స్థాయి మరిచి పేట్రెగి పోతున్న వైసీపీ నేతలపై రజనీ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ సినిమాలోని ఓ డైలాగ్ తో మీమ్స్ చేస్తూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందంటూ మీమ్స్ వదులుతున్నారు. తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ట్విటర్‌లో “వైఎస్సార్సీపీ అపాలజీ రజనీ” అనే హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది. అదేవిధంగా “తెలుగు పీపుల్ విత్ రజనీ” అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇక, వైసీపీ డాగ్స్ బౌబౌ అంటూ మొరగడం ఆపాలంటూ అటు నెటిజన్లు కూడా నిప్పులు చెరుగుతున్నారు.

ఇక.. విజయవాడలో మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజనీ..ఆ వేదికపై చంద్రబాబుతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఎక్కడా వైసీపీ గురించి గానీ, జగన్ గురించి గానీ పల్లెత్తు మాట అనలేదు. కానీ, చంద్రబాబును పొగడడమే తప్పన్నట్టుగా మంత్రులు, రజనీకాంత్ పై నోరుపారేసుకుంటున్నారు. రజనీలాంటి లాంటి లెజండరీ పర్సనాలిటీపై వైసీపీ నేతలు బరితెగించి చేస్తున్న విమర్శలను ప్రతీ ఒక్కరూ తప్పుబడుతున్నారు.

జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలను… తెలుగు ప్రజలెవరూ సహించరంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే..శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం… ఆకాశంపై ఉమ్మి వేయడమేనన్నారు చంద్రబాబు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకోవాలి డిమాండ్‌ చేశారు.

రజినీకాంత్‌కు మొదట్నుంచి నందమూరి, నారా కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీకాంత్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ వేదికపై సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యలపై పొగడ్తల వర్షం కురిపించారు రజనీ. ముఖ్యంగా చంద్రబాబు విజనరీ కలిగిన నేత అని, హైదరాబాద్ నగరం అభివృద్ధి‌లో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఏపీని కూడా చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దుతారని, ఆ సత్తా చంద్రబాబుకు ఉందంటూ ఆయన నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడా వైసీపీ, ఆ పార్టీ నేతల గురించి మాట్లాడలేదు. కానీ, రోజా, కొడాలి నాని, అంబటి, అమర్నాథ్ లు…ఎన్టీఆర్, చంద్రబాబును పొగడడాన్ని జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారు. తమ ప్రత్యర్థులను ప్రశంసించే వాళ్లు, ఏపీకి వచ్చి నీతులు చెప్పొద్దంటూ మంత్రులు దిగజారి మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు.

మొత్తంగా, రజనీపై మొరుగుతున్న వైసీపీ నేతలకు సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. మీమ్స్ తో జగన్ భజన బ్యాచ్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. తమ అభిమాన నటుడికి సారీ చెప్పాలంటూ హాష్ ట్యాగ్ తో హోరెత్తిస్తున్నారు.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *