ఏప్రిల్ 28న విజయవాడకు వస్తున్నతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

ఏప్రిల్ 28న విజయవాడకు వస్తున్నతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

ఆంధ్రుల అరాధ్యనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారవు శతజయంతి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 28న ఎన్టీఆర్ 100వ పుట్టినరోజును పురస్కరించుకుని శతజయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా.. బెజవాడలో శతజయంతి ఉత్సవల సందడి ఏప్రిల్ 28 నుంచి లాంఛనంగా మొదలు కానుంది.28న పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటరత్న నందమూరి బాలకృష్ణ వంటి అతిరథ మహారధులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితంపై రూపొందించిన ప్రత్యేక సావనీర్‌‌ను రజనీకాంత్ ఆవిష్కరిస్తారని ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి.జనార్థన్ రెడ్డి తెలిపారు.ఇక.. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా ఈ సావనీర్‌ను తీసుకు వస్తున్నారు.

ఈ మేరకు టీడీ జనార్ధన్‌ నేతృత్వంలో సావనీర్‌ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో సావనీర్‌ను తీసుకురావడంతో పాటు ఎన్టీఆర్‌ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఓ వెబ్‌సైట్‌ను, యాప్‌ను కూడా తీసుకురానున్నారు. సావనీర్‌, వెబ్‌సైట్‌, యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఎన్టీఆర్‌ ప్రసంగాలతో రెండు పుస్తకాలను కూడా తీసుకురానున్నారు.

టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్‌ ప్రసంగాలు తెలుగుజాతిని ఉర్రూతలూగించాయి. చారిత్రక ప్రసంగాల పేరుతో వీటిని వెలువరించనున్నారు. ఈ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణను విజయవాడలో చేయనున్నారు. ఈనెల 28న పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *