పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

చరణ్-ఉపాసన దంపతులకు తొలి సంతానానికి ముహూర్తం ఫిక్సయిందని తెలియగానే నిన్న సాయంత్రం నుంచి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెగా కుటుంబం సహా అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేశారు. ఈరోజు ఉపాసన ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను కన్‌ఫామ్‌ చేస్తు అపోలో హాస్పిటల్స్ అధికారిక లేఖను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం ఉపాసన- రామ్ చరణ్ దంపతులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఉపాసన తన భర్తతో కలిసి ఎంతో సింపుల్ గా నడుచుకుంటూ వెళ్లడం వీడియోల్లో కనిపించింది. వీరితో పాటు ఆమె తల్లి శోభనా కామినేని- అత్తగారు సురేఖ కొణిదెల ఆస్పత్రికి వచ్చారు.

ఇప్పటికే మెగాస్టార్ కి తాతయ్యగా మూడుసార్లు ప్రమోషన్ వచ్చింది. నాలుగోసారి తాతాయ్య ప్రమోషన్‌ను రామ్‌చరణ్‌ అందించాడు. చిరుకు ముగ్గురు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామ్‌చరణ్‌కు కూడ ఆడపిల్ల పుట్టడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ తండ్రి అయితే సంతోషపడాలని, పుట్టిన బిడ్డతో ఆడుకోవాలని ఉందంటూ కొన్నాళ్ల కిందట చిరంజీవి ప్రకటిం చారు . పిల్లలపై చరణ్-ఉపాసన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, చిరంజీవి ఒకింత బాధను వ్యక్తం చేశారు అమధ్య. ఎట్టకేలకు ఉపాసన గర్భం దాల్చడంతో రామ్ చరణ్, చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయాన్ని ముందుగా చిరంజీవే బయటపెట్టారు. అప్పట్నుంచి మెగా కాంపౌండ్ లో సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఉపాసన శ్రీమంతం వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. దుబాయ్ లో కూడా ఓ ఫంక్షన్ చేశారు.

ఉపాసన డెలివరీ కోసం ప్రపంచప్రసిద్ధ వైద్యుల్ని సంప్రదించారు. వాళ్ల పర్యవేక్షణలో ఉపాసన క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ డెలివరీకి సిద్ధమైంది. ఇక ఆ డేట్ వచ్చేసరికి, ప్రత్యేకంగా అపోలో హాస్పిటల్ లో అంతర్జాతీయ వైద్య బృందాన్ని సిద్ధం చేశారు.2012లో రామ్‌చరణ్‌ ఉపాసనకు పెళ్ళైంది. రిసెంట్‌గా వాళ్ళు 11వ వెడింగ్‌ యానివర్సీ కూడా జరుపుకున్నారు. ఇప్పుడు పాప పుట్టడంతో మెగా ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రామ్‌చరణ్‌ బెస్ట్ ఫ్రెండ్‌ తారక్‌ కూడా రామ్‌ చరణ్‌ని పెరెంట్స్‌ క్లబ్‌కు వెలకమ్‌ చెబుతూ.. మీ అమ్మాయితో గడిపె ప్రతి మూమెంట్ అన్‌ ఫర్గటబుల్‌ గా ఉండాలని ట్వీటర్‌లో విష్‌ చెప్పాడు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *