బుచ్చిబాబు తో సినిమాకు రామ్‌ చరణ్‌ సిగ్నల్‌

బుచ్చిబాబు తో సినిమాకు రామ్‌ చరణ్‌ సిగ్నల్‌

డెబ్యూ మూవీ ఉప్పెనతోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన డైరెక్టర్‌ బుచ్చిబాబు. సుక్కు దగ్గర డైరెక్షన్‌ డిపార్టెమెంట్‌లో వర్క్‌ చేసి ఎక్సపిరియాన్స్‌ తెచ్చుకుని అదే సుకుమార్‌ రైటింగ్స్‌ మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో ఉప్పెన చేశాడు. దాంతో టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయ్యాడు. మైత్రి మూవీస్ రెండో సినిమాను ఓ మీడియం రేంజ్‌ హీరోతో చేయమని పట్టుపట్టింది. కానీ బుచ్చిబాబు స్టార్‌ హీరోతోనే మూవీ చేయాలని భీష్మించకుని కూర్చున్నాడు. అంతేకాదు తన ఫెవరేట్‌ హీరో ఎన్టీఆర్‌తోనే రెండో సినిమా చేయాలని చాలా రోజులు వెయిట్‌ చేశాడు. కథను కూడా వినిపించాడు గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకున్నాడు. కానీ యంగ్‌టైగర్‌ డేట్స్‌ ఖాళీలేక ఆ కథలో మార్పులు చేసి ఇప్పుడు రామ్‌ చరణ్‌తో చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

చెర్రీ రంగస్థలం టైమ్‌లోనే బుచ్చిబాబు కమిట్‌మెంట్‌కు , వర్క్‌కు ఫిదా అయ్యాడట. అందుకే ఇప్పుడు బుచ్చిబాబుతో సినిమాకు సిగ్నల్‌ ఇచ్చాడని టాక్‌. బుచ్చి రామ్‌ చరణ్‌తో చేసే కథ ఫైనల్‌ వెర్షన్‌ను రెడీ చేశాడట. ఈ మూవీ లాంఛ్‌ కోసం చరణ్‌ కూడా డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడని అంటున్నారు. ఆగస్టులో సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది చివరలో లేదా 2024 జనవరిలో మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇందుకు మెగా పవర్‌స్టార్‌ కూడా సిగ్నల్ ఇచ్చాడట. తర్వలోనే ప్రీ ప్రోడక్షన్‌ పనులు పూర్తి చేసి.. వర్క్‌షాప్‌ ఒకటి కండట్‌ చేస్తాడాట. ఆ వర్క్ షాప్ లో చరణ్‌ పాల్గొనాల్సిన అవసరం ఉందట. అక్టోబర్‌లో చరణ్‌ బుచ్చిబాబు టీమ్‌తో వర్క్‌ షాప్‌కు అటెండ్‌ అవుతాడట.ఈ సినిమాను భారీ లెవెల్‌లో ప్లాన్‌ చేశాడని టాక్‌ వినిపిస్తుంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆస్కార్‌ విన్నర్‌ రెహామాన్‌ను అప్రోచ్‌ అవుతున్నాడట బుచ్చిబాబు. అంతేకాదు హీరోయిన్‌ ప్రాజెక్ట్‌ కేతో టాలీవుడ్‌ లో అడుగుపెడుతున్న దీపీకా పదుకోనేని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అన్ని అనుకున్నాట్లు జరిగితే.. బుచ్చిబాబు ప్లాన్‌ ప్రకారం జెట్‌ స్పీడ్‌తో పూర్తి చేసి.. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెవాలని ప్లాణ్‌ చేశాడు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *