రంగబలి సినిమా రివ్యూ

రంగబలి సినిమా రివ్యూ

రంగబలి సినిమా పైన నాగశౌర్య చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో కచ్చింగా కమ్‌బ్యాక్‌ అవుతుందని.. ప్లాప్స్ లకు బ్రేకులు పడుతాయనుకున్నాడు. థియేటర్‌కి వెళ్ళిన ఆడియన్స్ కూడా సినిమా స్టార్ట్‌ అవ్వగానే అదే ఫీలావుతాడు.. ఫస్టాఫ్‌ మొత్తం నాన్‌స్టాప్‌ కామెడితో థియేటర్‌ మొత్తం నువ్వులతో నిండిపోతుంది. కమెడియన్‌ సత్య హీలేరియాస్‌ కామెడి అయితే నెక్ట్‌ లెవెల్‌ అనే చెప్పాలి. నాగ శౌర్య తన టైమింగ్ అండ్ యాక్షన్‌తో బాగానే మెప్పించాడు. ఎమోషన్స్‌ సీన్స్‌లో ఎమోషన్స్‌ని కూడా బాగానే ప పండించాడు. హీరో ఫాదర్‌ రోల్‌ చేసిన గోపరాజు రమణ కామెడికి కామెడీ ఎమోషన్స్‌కి ఎమోషన్స్‌ని చించేశాడు. ఫస్టాఫ్‌ అంతా సూపర్బ్‌గా సాగిపోతుంది.

అసలు కథ మొత్తం సెకండాఫ్‌లో మొదలైంది. ఫస్టాఫ్‌ అంతా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయిన రంగబలి సెకండాఫ్‌లో డల్‌ అయింది. కథ చెప్పడం మొదలు పెట్టక పవన్‌లో పసతగ్గినట్లు అనిపిస్తుంది . స్క్రీన్‌ప్లే గాడి తప్పిన విషయం చాలా క్లీయర్‌గా కనిపిస్తుంది. దానికి తోడు స్లో నెరేషన్‌.. దాంతో అప్పటి వరకు జాలీగా ఉన్న సినిమా సడన్‌గా డల్‌ అవుతుంది. రోటీన్‌ ష్లాప్‌ బ్యాక్‌తో రోడ్డకొట్టుడులా అనిపిస్తుంది. క్లైమ్యాక్స్‌ 20 నిమిషాలు పాటు మళ్ళీ నవ్వించాలని నడుంబింగిచిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దర్శకుడు రాజవరం ఊరు చుట్టే రిపీటెడ్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడపడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకు శాపంలా మారాయి.

పవన్‌ తీసుకున్న స్టోరీ.. సత్య, గోపరాజు క్యారెక్టర్లు బాగున్నప్పటికీ.. స్క్రీప్లే మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. విలన్ షైన్ టామ్ చాకో క్యారెక్టర్‌ ఇంకా బాగా డిజైన్‌ చేసి ఉంటే బాగుండు అన్న ఫీల్‌ కలిగించింది. అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి హెల్ప్‌ అయ్యేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. ఇక హీరోయిన్‌ క్యారెక్టర్‌ కూడా ఉందంటే ఉంది. పాటలు గ్లామర్‌ షో వరకే పరిమితమైంది యుక్తి తరేజా. . కామెడీ కోసం అయితే రంగబలి ఓసారి ట్రై చేయవచ్చు. ఓవరాల్ గా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *