తెలంగాణ లో టిడిపి పరిస్థితి పై రావుల విశ్లేషణ

తెలంగాణ లో టిడిపి పరిస్థితి పై రావుల విశ్లేషణ

ఎన్టీఆర్, చంద్రబాబు లు తెలంగాణ అభివృద్ధి ప్రదాతలు

టిడిపి ఆవిర్భావంతో సామాజిక విప్లవం

సోషలిజం, సెక్యులరిజం, హ్యూమనిజం .. టిడిపి విధానం

జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర

తెలంగాణ లో టిడిపి క్యాడర్ బలంగా వున్నా నాయకత్వ లేమితో కొంత ఇబ్బంది

ఇంటింటికీ తెలుగుదేశం ద్వారా కొత్త ఓటర్ల కు చేరుతున్న టిడిపి భావజాలం

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం, పూర్వ వైభవం దిశగా కార్యాచరణ అమలవుతున్నదని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రూపొందించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నదని రావుల చెప్పారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీతోనే రాజకీయ పయనం సాగిస్తున్న రావుల తెలంగాణ లో పార్టీ పరిస్థితులపై తన మనోభావాలను చైతన్యరథం తో పంచుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పరిణామక్రమాన్ని రావుల విశ్లేషించారు.

తెలంగాణా లో 2004 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదని, ఆ సమయంలో జన్మించిన లేదా ఊహ తెలియని వయసులో వున్న వారంతా ప్రస్తుతం ఓటర్లు అయ్యారని చెప్పారు. వారికి తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి లక్ష్యాలు, భావజాలం, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు లు అభివృద్ధి పరచిన తీరు తదితర అంశాలపై అవగాహన వుండదని ఆయన అభిప్రాయ పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నే తెలంగాణ లో ఒక సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం వచ్చిన విషయాన్ని నేటి తరానికి వివరించాల్సిన బాధ్యత నాయకులపై వున్నదని ఆయనన్నారు. సోషలిజం, సెక్యులరిజం కు తోడుగా హ్యుమనిజం, అనే సైద్ధాంతిక ప్రాతిపదికగా టిడిపి జనబాహుళ్యంలో కి వచ్చిందని చెప్పారు. అందువల్లే పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాలంలో అధికారంలోకి రాగలిగినట్టు చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ ల అభివృద్ధి లో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల పాత్ర మరువలేనిదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, మాండలిక వ్యవస్థ ఏర్పాటు, సింగిల్ విండో విధానం వంటివి సామాజిక మార్పుకు దోహదపడినట్టు అభిప్రాయపడ్డారు. తినడానికి తిండి, వుండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట అనే మూల సిద్ధాంతంలో భాగంగానే, రూ.2లకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతావస్త్రాలు వంటి పథకాలు రూపుదాల్చినట్టు వివరించారు. విద్య, వైద్య రంగాలకు టిడిపి అత్యధిక ప్రాధాన్యత నిచ్చిందన్నారు. తెలుగు విశ్వ విద్యాలయం, మహిళా యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ వంటివి తొలిసారిగా ఏర్పాటు చేసిన ఘనత టిడిపి కే దక్కుతుందని తెలిపారు.

టిడిపి ఏ కార్యక్రమం తలపెట్టినా దానిలో జనహితం ఇమిడి వుంటుందన్నారు. తెలుగు గ్రామీణ క్రాంతి పథం పథకం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని చెప్పారు. పంట భూముల్లో బోర్లు వేసుకోవటం, కాలువలు, చెరువులు, నీటికుంటలు తవ్వుకునెందుకు అయ్యే వ్యయంలో రైతులు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా 50 శాతం వ్యయం భరిస్తే మిగిలిన 50 శాతం ప్రభుత్వం భరించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారని వివరించారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో సైతం కీలక పాత్ర పోషించిందని రావుల చెప్పారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. 1984 లో నాదెండ్ల భాస్కరరావు ఉదంతం సందర్భంగా ఇందిరాగాంధీ వంటి నాయకురాలి నిర్ణయాన్ని పునరాలోచింప చేసి, తిరిగి అధికారం చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని వెల్లడించారు.

అభివృద్ధిని పరుగులు పెట్టించిన చంద్రబాబు

చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని రావుల చెప్పారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవం పెంపొందిస్తే చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్ని నింపారని తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఐటి, బయోటెక్నాలజీ (బిటి) రంగాలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతి కిలోమీటరు కు ఒక ప్రాథమిక పాటశాల, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ విద్య సంస్థ, 5 కిలోమీటర్లు కు ఒక హై స్కూల్, ప్రతి డివిజన్ కు ఒక ఇంజినీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక వైద్య కళాశాల వుండే విధంగా చంద్రబాబు ప్రణాళికలు అమలు జరిపారని వివరించారు. ఫలితంగా లక్షల సంఖ్యలో ఐటి నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో తొలిసారిగా ఏర్పాటైన గురుకులాలను చంద్రబాబు కళాశాల ల స్థాయికి తీసుకెళ్లారన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్ నుంచే వస్తున్నదని రావుల చెప్పారు. హైదరాబాద్ లో ఐటి రంగాన్ని విస్తృత పరచటంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఐ ఎస్ బి ఏర్పాటు, మెట్రో రైల్ రూపకల్పన వంటివి చంద్రబాబు హయాంలో నే సాకారం అయ్యాయని వివరించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేశారన్నారు. కర్ఫ్యూ నగరంగా వున్న హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ తయారీ నగరంగా గుర్తింపు పొందటానికి జీనోమ్ వ్యాలీనే ప్రధాన కారణం అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ట్యాంక్ బండ్ సుందరీకరణ జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో నెక్లెస్ రోడ్ ఏర్పాటు, ముషీరాబాద్ జైలును చర్లపల్లి కి తరలించి గాంధీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని తెలిపారు. చంద్రబాబు హయాంలో క్రీడల అభివృద్ధికి సైతం ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లు ఏర్పాటు చేసి నేషనల్, ఆఫ్రో ఆషియన్ గేమ్స్ సమర్థంగా నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా జీఎంసి బాలయోగి పేరుతో ఏర్పాటు చేసిన స్టేడియం నే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ‘ టిమ్స్ ‘ ఆసుపత్రి గా మార్చిందని చెప్పారు.

యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు

చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్రపతి, ప్రధాని లను నిర్ణయించటం లో చంద్రబాబు కీలక పాత్ర పోషించినట్టు రావుల తెలిపారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ చరిత్రపై చెరగని ముద్ర వేసిందన్నారు.

నాయకత్వ లేమి

తెలంగాణ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో టిడిపి బలంగా వున్నప్పటికీ నాయకత్వ లేమి కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయని రావుల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 లో టిడిపి తరపున గెలుపొందిన 15 మంది, 2018 లో విజయం సాధించిన ఇరువురూ ఎమ్మెల్యే లు ఇతర పార్టీలలో చేరిపోయారు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అమలు పరచిన 26 అభివృద్ధి నమూనాలను ఫోటో ప్రదర్శన ద్వారా వివరించినట్టు రావుల వెల్లడించారు. దానికి పార్టీ శ్రేణులు నుంచి అద్భుత స్పందన లభించిందన్నారు.

ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, 14 జిల్లాలలో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తింపు, హైదరాబాద్ నుంచే హజ్ యాత్రకు శ్రీకారం చుట్టడం వంటి కార్యక్రమాలు ముస్లిం సోదరుల సంక్షేమానికి దోహద పడ్డాయి అని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి అద్భుత స్పందన లభిస్తున్నది అని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ లోనూ టిడిపికి పూర్వ వైభవం రావటం తథ్యమని రావుల ధీమా వ్యక్తం చేశారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *