
యువనేతను కలిసిన రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు
- Ap political StoryNewsPolitics
- April 21, 2023
- No Comment
- 36
ఆదోనిలో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
ఆదోనిలోని ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలి.
పత్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
రాయలసీమలో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి.
అప్పర్ భద్ర నిర్మాణాన్ని ఆపకపోతే వచ్చే రాయలసీమకు వచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా ఆగిపోయే ప్రమాదముంది.
కౌతళం మండలం మెలిగనూరు వద్ద వరదకాల్వ నిర్మించాలి.
వేదవతి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8 టీఎంసీలకు పెంచాలి.
ప్రస్తుతం ఆర్ డిఎస్ కుడికాల్వలను 4 టిఎంసిలతో నిర్మిస్తున్నారు, కుడికాల్వ 8టిఎంసిలతో నిర్మిస్తేనే సాగు,తాగునీరు అందుతుంది.
పులికనుమ ప్రాజెక్టును 5 టిఎంసిల సామర్థ్యానికి పెంచాలి.
మా ప్రాంతంలో పేదల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కళాశాలలు లేని కారణంగా చదువు ఆపేసి వలసలు వెళ్తున్నారు.
పశ్చిమ రాయలసీమలో అత్యంత వెనుక బడిన తమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగావకావకాశాలు కల్పించే పరిశ్రమలు ఏర్పాటుచేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించడానికి చేతులురావడంలేదు.
అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే సీమ ఎడారవుతుంది..దీనిపై జగన్ నోరుమెదపడం లేదు.
ముఖ్యమంత్రి జగన్ కు రాయలసీమ ఓట్లపై తప్ప రాయలసీమ ప్రజలపై ఎటువంటి ప్రేమ లేదు.
వేదవతి ప్రాజెక్టును ఈ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించింది..మేము వచ్చాక 8 టీఎంసీలకు పెంచుతాం.
టిడిపి అధికారంలోకి వచ్చాక పశ్చిమ రాయలసీమలో విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటుచేసి వలసలను నివారిస్తాం.