రూ.2వేల నోట్లు రద్దు..ఆలోగా మార్చుకోకపోతే?

రూ.2వేల నోట్లు రద్దు..ఆలోగా మార్చుకోకపోతే?

2వేల రూపాయల నోట్ల జారీపై ఆర్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. చలామణిలో ఉన్న 2వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కస్టమర్లకు 2వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 2వేల నోట్లు ఉన్న వారు సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే 2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ తెలిపింది.

దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఒక విడతలో 20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేదు. గత కొన్నాళ్లుగా 2వేల నోట్లు చలామణిలో లేవు. 2వేల నోట్లు బంద్ అయిపోయినట్లుగా గతంలో ప్రచారం జరిగినా..ఆర్బీఐ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా, ఎన్నికలకు ముందు 2వేల నోట్ల రద్దు వ్యవహారం సంచలనంగా మారింది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *