
గ్లోబ్ అవార్డు సాధించిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ
- MoviesNews
- January 24, 2023
- No Comment
- 93
గ్లోబ్ కొట్టిన ట్రిపుల్ ఆర్
గ్లోబ్ అవార్డు సాధించిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. జాతీయ, అంతర్జాతీయ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ ప్రతిష్టాత్మకమైన ” గోల్డెన్ గ్లోబ్ ” సాధించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో “నాటు.. నాటు” పాటకు ఈ అవార్డు లభించింది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ వేదికగా జరిగిన అవార్డుల వేడుకలో.. చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి.. గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించారు. మరోవైపు.. ఉత్తమ ఆంగ్లేతర చిత్రంం రేసులోనూ ట్రిపుల్ ఆర్ మూవీ నిలవటం విశేషం. ఇక.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై నాటు నాటు పాటకు చరణ్, తారక్, రాజమౌళి క్లాప్స్ కొడుతూ చేసిన డ్యాన్స్ సభికులను అలరించింది. మొత్తం మీద.. మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మక పురస్కారం దక్కటం పట్ల.. రాం చరణ్, తారక్ అభిమానులతో పాటు సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
స్పాట్..