సస్పెన్స్, థ్రిల్లర్ తో.. ఆకట్టుకున్న విరూపాక్ష

సస్పెన్స్, థ్రిల్లర్ తో.. ఆకట్టుకున్న విరూపాక్ష

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ జంటగా నటించిన మూవీ విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వంలో.. ఈ మూవీ తెరకెక్కింది. టీజర్,ట్రైలర్ తో విరూపాక్ష మంచి హైప్ తెచ్చుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ మూవీ .. విడుదలకు ముందే.. దాదాపు .. 25 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ చేసి.. టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. థ్రిల్లర్ సినిమాలు అంటే ఆడియన్స్ కి మొదటి నుండి ఎంతో క్రేజ్ ఉంది. తెలుగులో హారర్ అనుభూతిని టీజర్, ట్రైలర్ ద్వారా అనిపించిన చిత్రం విరూపాక్ష. నిజ జీవితంలో.. సాయి ధరమ్ తేజ్ కు జరిగిన పెద్ద యాక్సిడెంట్ తర్వాత..కోలుకుని..నటించిన ఈ సినిమాకు మొదటి నుంచి.. తెలుగు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన మూవీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

విరూపాక్ష కథ విషయానికి వస్తే రుద్రవనం అనే గ్రామంలో 1979 నుంచి 1991 జరిగిన సంఘటనలను ఆధారంగా.. దర్శకుడు కార్తిక్ కథను తీర్చిదిద్దారు. రుద్రవనంలో.. చేతబడులు చేస్తున్నారని.. దంపతులను.. గ్రామస్తులందరూ కలిసి.. సజీవదహనం చేస్తారు. ఆ దంపతులు మరణిస్తూ.. పుష్కరం లోపు .. గ్రామంలోని ప్రజలందరూ చనిపోతారని..శపిస్తారు. ఇక ఆ తర్వాత.. కథను.. 1979 నుంచి.. 1991 లోకి అడుగుపెడుతుంది.ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా.. రుద్రవనం గ్రామం మొత్తాన్ని మంత్రం శక్తితో అష్ట దిగ్బంధనం చేసినా కూడా వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి.ఈ హత్యలు చేస్తున్నది ఎవరనేది.. కనుక్కోవడానికి సూర్య పాత్ర ద్వారా హీరో.. సాయి ధరమ్ తేజ్ రంగం లోకి దిగుతాడు. సూర్య రంగం లోకి దిగిన తర్వాత .. రుద్రవనం గ్రామంలో ఎవ్వరూ ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అసలు రుద్రవనంలో గ్రామంలో సూర్య వచ్చిన తర్వాత.. ఏం జరిగింది.. అసలు సూర్య ఎవరు.. ? రుద్రవనంలో..జరిగే హత్యలను సూర్య ఆపగలిగాడా..? అన్నదే కథాంశం.

విరూపాక్ష కథలోని పాయింట్ చిన్నదే అయినా.. కథానుసారం వచ్చే పాత్రలు… మనకు అత్యంత ఆసక్తిని కలిగిస్తాయి. తెలుగులో సస్పెన్స్ తో కూడిన.. హారర్ సినిమాలు వచ్చినా.. ఓ రేంజ్ థియేట్రికల్ అనుభూతిని మాత్రం మనకి కలిగించలేదు. రీసెంట్ గా వచ్చిన మసూదా పర్వాలేదు అనిపించింది కానీ.. విరూపాక్ష చిత్రం మాత్రం ప్రేక్షకులను వణుకుపుట్టించే రేంజ్ సినిమా అని మాత్రం కచ్చితంగా చెప్పగలం. విరూపాక్ష చిత్రం మరో చంద్రముఖి అరుంధతి రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అంత అద్భుతంగా థ్రిల్లింగ్ కి గురి అయ్యే విధంగా డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కార్తీక్ కు మొదటి సినిమా అంటే మాత్రం ఎవ్వరూ నమ్మలేరు.

హీరో సాయి ధరమ్ తేజ్.. సూర్య పాత్రలో యాక్టింగ్ సినిమాకు హైలైట్.తన కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. చాలా అద్భుతంగా నటించారు. హీరోయిన్ సంయుక్త మీనన్ పవర్ ఫుల్ రోల్ లో ఫెర్మామెన్స్ చాలా బాగుంది.కేవలం యాక్టింగ్ పరంగానే కాదు.. స్క్రీన్ పై సంయుక్త చాలా గ్లామర్ గా కనిపించింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ఇచ్చే ట్విస్టు లు.. ఇక ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. మిగతా కీలక పాత్రల్లో కనిపించిన సునీల్, అజయ్ , బ్రహ్మజీ, సాయి చంద్ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో వచ్చే సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు.. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి. ముఖ్యంగా మూవీ.. చివరి 30 నిమిషాలు ఆడియన్స్ చాలా ఆకట్టుకుంది. అంతలా సస్పెన్స్ కి గురి చేస్తుంది విరూపాక్ష మూవీ..

కాంతారా ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ తో.. ప్రేక్షకులకు.. ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.ఇక బీజీఎమ్ అంతే అద్భుతంగా ఉంటూ థ్రిల్ కు గురి చేస్తుంది. ఇచ్చాడు.దీంతో..చిన్న చిన్న సీన్లు కూడా ఎలివేట్ అయ్యాయి. మొత్తం మీద హారర్ జానర్ మీద ఇటీవల తెరకెక్కిన సినిమాల్లో ‘విరూపాక్షా’ చిత్రం రీసెంట్ టైం లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పాలి. గ్రామీణ వాతావరణాన్ని.. దర్శకుడు కార్తీక్ చాలా బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. చిత్రి నిర్మాణ విలువలు.. చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన .. విరూపాక్ష సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూస్తే మంచి ఫీల్ గుడ్ ను ఇస్తుంది.

రేటింగ్ : 3.5 /5

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *