ఎన్టీఆర్ 30లో.. సైఫ్ అలీఖాన్

ఎన్టీఆర్ 30లో.. సైఫ్ అలీఖాన్

ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ మూవీలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి సైఫ్ తప్పుకున్నట్టు నిన్నటివరకు వార్తలొచ్చాయి. ఈ వదంతులను కొట్టివేస్తూ.. ఎన్టీఆర్ మూవీ సెట్స్‌లో సైఫ్ అలీఖాన్ అడుగుపెట్టాడు. సైఫ్ నటిస్తున్న రెండో తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రభాస్ ఆదిపురుష్ తో సైఫ్ ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత తాజాగా మరో మూవీ సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లో జాన్వీకి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సెట్ లో సైఫ్ అలీఖాన్ జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ లపై డైరెక్టర్ కొరటాల సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంలో కొరటాల – ఎన్టీఆర్ తో కలిసి సైఫ్ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడం తో దీనిపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఈ సినిమాకు దేవ‌ర అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌తో క‌లిసి సైఫ్ అలీఖాన్ దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. ఈ షెడ్యూల్ కోసం ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ హైద‌రాబాద్ వ‌చ్చేశారు. తాజాగా సైఫ్ అలీఖాన్ మూవీ షూటింగ్‌లో భాగ‌మ‌య్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌తో పాటు సైఫ్ అలీఖాన్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు తె లిసింది.

ఎన్టీఆర్ 30వ సినిమాను దర్శకుడు కొరటాల.. రివెంజ్ డ్రామాతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్‌ కు దర్శకుడు కొరటాల శివ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై హరికృష్ణ కె. మరియు సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. NTR 30వ చిత్రం.. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని… 2024 ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జూనియర్‌కు ఉన్న భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *