రాజకీయ ప్రత్యర్ధుల హిట్‌లిస్టులో సజ్జల..?

రాజకీయ ప్రత్యర్ధుల హిట్‌లిస్టులో సజ్జల..?

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు.. విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వైసీపీలో నెంబర్ టూ పొజిషన్‌లో ఉండేవారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. సాక్షి మాజీ ఉద్యోగి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ స్థానాన్ని ఆక్రమించారు. విలేకరిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన సజ్జల.. వైసీపీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఆ తరువాత ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు. ఆ పదవి ద్వారానే… సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం దక్కని “షాడో సీఎం” హోదాకు చేరుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వ సలహాదారు పదవిని అడ్డుపెట్టుకుని సజ్జల అన్ని విషయాల్లో వేలు పెట్టటం మొదలు పెట్టారు. పార్టీ నాయకులకు పదవుల కేటాయింపు నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల వరకు అన్నీ తన కనుసన్నల్లోనే జరిగేలా.. సజ్జల తన పొజిషన్‌ను సెట్ చేసుకున్నారు.

వాస్తవానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేసిన జగన్ రెడ్డికి గానీ.. ఆయన సలహాదారుగా చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డికి గానీ ఎలాంటి పరిపాలనా అనుభవం లేదు. అయితే సీఎం జగన్ రెడ్డి సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులను సంప్రదించటం మానేసి… సజ్జల సలహాలపైనే ఆధారపడుతూ వస్తున్నారు. ఆయన సలహాలతో సీఎం జగన్ రెడ్డి తీసుకున్న వందలాది నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. న్యాయ సమీక్ష ముందు నిలబడలేక పోయాయి. ప్రభుత్వానికి తీవ్ర అప్రదిష్ట తీసుకు వచ్చాయి. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిలా తయారయ్యారని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. గిట్టని రాజకీయ నాయకులపై దాడులు, పోలీసు వేధింపులు, అక్రమ కేసులతో సజ్జల అరాచకం సృష్టిస్తున్నారని ఆందోళనలకు దిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఏపీలో విపక్ష పార్టీలపై జరిగిన ప్రతీ దాడి వెనుకా సజ్జల హస్తం ఉందనేది విపక్షాల మాట. అయితే.. వాటిని వైసీపీ వర్గాలు ఖండిస్తూ వస్తున్నాయి.

ఇక.. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ప్రజా వేదిక కూల్చివేత నుంచి ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటం..స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు, న్యాయ మూర్తులపై ధూషణలు.. టీడీపీ ఆఫీసు, నేతలపై దాడి, రఘు రామకృష్ణ రాజు టార్చర్ వరకు ప్రతీ ఘటనలోనూ సజ్జల పేరే బయటకు వచ్చింది. సీపీఎస్ రద్దుపై యూ టర్న్, రివర్స్ పీఆర్సీ, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటి వంటి.. సీఎం జగన్ డిజాస్టర్ డిసెషన్స్ వెనుక సజ్జల సలహాలే ఉన్నాయంటారు. క్రమం తప్పకుండా బటన్ల మీద బటన్లు నొక్కుతున్నా… జగన్ సర్కార్ గ్రాఫ్ ఈ రేంజ్‌లో పడిపోవటం సజ్జల సలహాల పుణ్యమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సజ్జల వ్యవహారశైలిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సజ్జల డైరెక్షన్.. జగన్ యాక్షన్ అన్నట్టుగా తయారైన పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిలదీస్తోంది. కానీ.. టీడీపీ విమర్శలపై వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం.. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడటంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇన్నాళ్ళూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను మించి.. వైసీపీ నేతలు సజ్జలపై విరుచుకు పడుతున్నారు. సాక్షిలో ఓ సాధారణ ఉద్యోగిగా పని చేసిన సజ్జలకు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించగా.. సజ్జల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం సజ్జల ఓ ఆరాచక శక్తిలా మారారంటూ తీవ్ర విమర్శలు చేశారు. వీరందరి మాటలను బట్టి చూస్తే.. షాడో సీఎంలా సజ్జల వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి ఎవరి మాటా వినే లక్షణం లేని సీఎం జగన్ రెడ్డి.. సజ్జల మాటను నిజంగానే వింటున్నారా..? అనే అనుమానం చాలా మందిలో వ్యక్తం అవుతోంది. సజ్జల సలహాలను సీఎం నిజంగానే పాటిస్తున్నారా..? లేక సీఎం జగన్ నిర్ణయాలే.. సజ్జల సలహాలుగా బయట ప్రచారం పొందుతున్నాయా..? అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగానే మారింది. అయితే.. సలహాదారు సజ్జలను ముందు పెట్టి.. సీఎం జగన్ కథ నడిపిస్తున్నారనే గుసగుసలు సైతం వైసీపీలో వినిపిస్తున్నాయి. రేపు ఏదైనా తేడా వస్తే.. అంతా సజ్జల మీదకే తోసేసే వ్యూహం దీని వెనుక దాగి ఉందని అంటున్నారు. మొత్తం మీద.. ఏపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా మారిన సజ్జల చుట్టూ పొలిటికల్ ఫోకస్ పెరగుతోంది. అయితే ఈ ఎన్నికల సంవత్సరంలోనూ సజ్జల సలహాలను సీఎం జగన్ పాటిస్తారా..? లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత తన రూటు మార్చుకుంటారా..? అనేది వేచి చూడాలి.

Related post

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…
మూడో రోజు కూడా మాజీ మంత్రి నారాయణ హౌస్ అరెస్ట్

మూడో రోజు కూడా మాజీ మంత్రి నారాయణ హౌస్ అరెస్ట్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నెల్లూరు వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులను హౌస్​ అరెస్టు చేయడంతో పాటు…
మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ

మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ

నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. నగర నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా ఆయన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారు. రెండు రోజుల క్రితం 39వ డివిజన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *