
సలార్ మూవీ టీజర్ రివ్యూ
- EntertainmentMoviesNews
- July 6, 2023
- No Comment
- 21
బాహుబలి తరువాత ఆరేంజ్ హిట్ డార్లింగ్ చూడలేదు.. మళ్ళీ సాలిడ్ హిట్ కొట్టి ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయలని ఫ్యాన్స్ కొరుకుంటున్నారు. అందుకే ఆశలన్ని సలార్ పైనే పెట్టుకున్నారు. కే.జీయఫ్ చూసిన వాళ్ళు అలాంటి ఎలివేషన్స్ ప్రభాస్ కు పడితే నెక్ట్ లెవెల్ ఉంటాయని రికార్డులు బద్దలవడం కన్‌ఫామ్ అని ఫిక్స్ అయ్యారు అందుకే ప్రశాంత్ నీల్‌తో సినిమా అనగానే.. ఫ్యాన్స్ అనందానికి హద్దులేవ్. టీజర్ ఎప్పుడు వస్తుందని కళ్ళు కాయలుకాచేల ఎదురు చూసారు అందరు అనుకున్న టైమ్ వచ్చేసింది. ఉదయం 5 :12 నిమిషాలకు ‘ది మోస్ట్ వైలెంట్ మెన్’ ఎంట్రీ ఇచ్చాడు. జంగిల్‌లో డైనోసర్ వేటా మొదలు కాబోతుందని డైరెక్టర్ క్లారీటి ఇచ్చాడు.
టీజర్ స్టార్టింగ్ లో ఓ గ్యాంగ్ మథ్యలో టీను ఆనంద చాలా సింపుల్ కథ చెప్పాడు. సింపుల్ ఇంగ్లీష్.. నో కన్ఫ్యూజన్… లయన్ చీతా టైగర్ ఎలిఫెంట్ వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. బికాజ్ ఇన్ దట్ పార్క్.. దేర్ ఈజ్ ఏ అంటు డైనోసర్ లాంటి ప్రభాస్‌ని చూపించి ఫ్యాన్స్‌తో కేకలు పెట్టించాడు. కేజీయఫ్‌ను మించి ఎలివేషన్స్ ఉంటాయని చెప్పడానికి ఈ ఒక్క డైలగ్ చాలు. ఎలివేషన్స్ తగ్గట్టుగా మైండ్ పోయే బిజియమ్. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ లో కోల్ మైనింగ్ ఏరియాలో కత్తి పట్టుకుని రెబల్‌స్టార్ చేసిన విధ్వంశం నెక్ట్ లెవెల్. డైనోసార్‌లా ప్రభాస్ క్యారెక్టర్ భయంకరంగా ఉంటుందని చెప్పడానికి చిన్న ఎగ్జామ్‌ఫుల్ ఆ ఫైట్ బిట్.
హీరో ఎలివేషన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయండంలో ప్రశాంత్ నీల్ మాస్టర్‌గా మారిపోయాడు అన్నడంలో ఎలాంటి డౌట్ లేదు.ఇప్పటి వరకు హీరోను సింహం, పులి అంటునే చెప్పడం విన్నం కానీ ఫస్ట్‌టైమ్ డైనోసర్‌తో పోల్చి ప్రభాస్ కటౌట్‌కు మరింత హైప్ ఇచ్చాడు. కేవలం మూడు క్యారెక్టర్స్‌నే టీజర్లో రివీల్ చేశాడు. ఏదేమైనప్పటికీ ప్రభాస్‌ను పూర్తిగా చూపించకపోవడం ఫేస్ రివీల్ చేయకపోడం.. ప్రభాస్‌తో ఒక్క డైలాగ్ ను చెప్పకపోవడం కొంచెం డిజపాయింట్ చేసింది. కేజీయఫ్‌కు సలార్‌కు ఉన్న లింక్ ఉందని విషయం టీజర్ రివీల్ చేశాడు. 5గం12 నిమిషాలకు రాకీభాయ్‌పై అటాక్ జరిగింది అదే టైమ్‌కు సలార్ టీజర్ వచ్చింది.. సలార్ విధ్వంశం చేసింది ఎక్కడ… అంటే విజువల్స్ ని బట్టి చూస్తే రాకీ భాయ్ మైనింగ్ అక్కడ ఉన్న కోడ్స్‌ను బట్టి అర్ధమౌతుంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అని కాప్షన్ పెట్టాడు సెప్టెంబరు 28న ఫస్ట్ పార్ట్ రానున్నట్లు క్లరీటీ ఇచ్చింది చిత్ర యూనిట్.