ఫాన్స్ కి షాక్ ఇచ్చిన సలార్ ..?

ఫాన్స్ కి షాక్ ఇచ్చిన సలార్ ..?

పబ్లిసీటి… పబ్లిసీటి.. పబ్లిసీటి.. ఇది సినిమా వాళ్ళ యాక్టీవిటీ అని ఆర్‌జీవి చెప్పాడు. అది నిజమే ఓ సినిమా నిర్మించడం ఎంత ముఖ్మమో దాన్ని ఆడియన్స్‌కు రీచ్‌ అయ్యేలా చెయ్యటం కూడా అంతే ముఖ్యం . దానికి కోసమే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌, లిరికల్‌ వీడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌, ఇంటర్వూస్‌ అంటు ప్లబిసీటి కోసం కూడా కోట్లు ఖర్చుపెడతారు. ఇది ప్రతి సినిమాకు కామన్‌గా జరిగే ప్రక్రియా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు ఇదే ఫాలో అవుతారు. ఈ స్ట్రేటజీ లో ఏది మిస్‌ అయిన ఆ ఎఫెక్ట్‌ కలెక్షన్స్‌ పై పడుతుంది. కానీ ఈ రూల్స్‌ని బ్రేక్‌ చేస్తానంటున్నాడు. ఇంతకి ఏవరా డేరింగ్‌ డాషింగ్‌ హీరో ఏంటా మూవీ అంటారా. ఇంకేవరు మన డైనోసర్‌.. పాన్‌ ఇండియా రెబల్‌స్టార్‌, క్రియేటీవ్‌ మేకర్‌ ప్రశాంత్ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సలార్‌ ఈ సినిమా సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ అవుతుంది. ఇప్పటీ వరకు ఈ మూవీ నుంచి రెండు పొస్టర్లు , టీజర్‌ మాత్రమే వచ్చాయి. అవి కూడా ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ని షేక్‌ చేశాయి.

ఇక సినిమా రిలీజ్ కి కూడా పెద్దగా టైమ్‌ లేదు ఓన్లీ 27రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకా ట్రైలర్‌ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్‌. ఓవర్‌సీన్‌లో మంచి హైప్‌తో బాక్సాఫీస్ బుకింగ్‌ జోరుగా సాగుతుంది. ఇండియాలో మాత్రం ఇంకా ఎలాంటి హడావిడి లేదు. టీజర్‌ మాత్రమే రిలీజ్ చేసి సైలెంట్‌గా ఉన్నారు. ఈ టైమ్‌లో చిత్ర యూనిట్‌ మారో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసులు వినిపిస్తున్నాయి. సలార్ మేకర్స్.. ఇతర ఏ మూవీ టీమ్స్ తీసుకొని డేరింగ్‌ డెసిషన్‌ తీసుకున్నాట్లు టాక్‌. అదేంటంటే ఈ సినిమా కోసం ఎటువంటి ప్రమోషన్స్ చేయరట. ఈవెంట్లు కూడా లేవ్‌ అంటున్నారు. ప్రమోషన్స్ లేకుండానే సింపుల్గా మూవీ రిలీజ్ కి ముందు ట్రైలర్ను విడుదల చేస్తారట. దానికి కారణం మూవీ అవుట్‌ ఫుట్‌ నిర్మాతలు చాలా కాన్ఫీడెంట్‌గా ఉన్నారట. దానికి తోడు ఇప్పటికే రిలీజైన టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. దానితోనే సినిమాపై వరల్డ్ వైడ్గా మంచి హైప్ క్రియేట్ అయింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్, నిర్మాతలు కూడా తమ సినిమా ఔట్పుట్పై నమ్మకంతో ఉన్నారట. సినిమా హిట్ అవ్వడం పక్కా అని ధీమాగా చెబుతున్నారట. అందుకే ఎటువంటి ప్రమోషన్స్, ఈవెంట్లకు డబ్బులు ఖర్చు పెట్టుకుండా సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయాలిని ఫిక్స్‌ అయ్యారట. ఇదే నిజమైతే.. ఈరోజుల్లో ఇది పెద్ద సాహసమే అని చెప్పాలి. పైగా ఈ సలార్‌ 1000 కోట్లు కొల్లగొట్టలని టార్గేట్‌ పెట్టుకున్నారు. అరేంజ్‌ కు రీచ్‌ అవ్వాలంటే పబ్లిసిటి మస్ట్‌గా కావాలి జక్కన్న కూడా మూవీస్‌ ప్రమోషన్‌ విషయంలో చాలా ప్లాన్డ్‌గా కేర్‌ తీసుకుంటాడు. సలార్‌ టీమ్‌ నిర్ణయానికి టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది. ఎంత పెద్ద కట్‌టౌ ఉన్న ప్రమోషన్‌ లేకపోతే రీచ్‌ తక్కువగా ఉంటుంది. ఈ ఫీట్‌తో ఎలాంటి సన్సేషన్‌ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *