
నా లైఫ్ నా ఇష్టం – సమంత
- EntertainmentMoviesNews
- March 30, 2023
- No Comment
- 37
టాలీవుడ్ గ్లామర్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన సినిమాలు ఆమేంటో నిరూపిస్తాయి. ఏ మాయ చేశావే సినిమాతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యారు. యువసామ్రాట్ నాగచైతన్యను ప్రేమంచి పెళ్లి చేసుకుని.. ఆ జంట సంచలనం సృష్టించింది. ఈడు – జోడుగా చాలా బాగుందని అందరూ అనుకునే సమయంలోనే.. నాగచైతన్యతో విడాకులు తీసుకుని.. వార్తల్లో నిలిచారు. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారన్నది.. మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయంలో.. నాగచైతన్య, సమంతకు మినహా దాదాపుగా ఎవరికీ సమాధానం తెలియదనే చెప్పాలి. కొందరు సమంతను నిందిస్తే.. మరి కొందరు నాగచైతన్యను విమర్శిస్తారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉంది.
యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సమంత.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సమంత పెళ్లి, విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైతూతో డైవర్స్ విషయంపై.. మరోసారి సమంత చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ చైతన్యతో డివోర్స్ గురించి తాజా కామెంట్స్ కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. తన లేటెస్ట్ మూవీ శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తన వైవాహిక జీవితంపై .. సామ్ వ్యాఖ్యానించింది.
చైతూ భార్యగా వంద శాతం కరెక్ట్ కానీ పెళ్లి వర్క్ అవుట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకుల విషయంలో తన తప్పేమి లేదంటూ డైరెక్ట్ కామెంట్స్ చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొత్తలో తానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ.. సామ్ భావోద్వేగం అయ్యారు. విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ రాగా .. వెంటనే ఓకే చెప్పానని సమంత వెల్లడించారు. అయితే కొందరు నా నిర్ణయాన్ని తప్పు పట్టారని.. విడాకులు అయిన కొద్ది రోజులకే ఎక్స్ పోజింగ్ అధికంగా ఉండే ఐటం సాంగ్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు హెచ్చరించారని తెలిపారు. తన ఆలోచన మానుకోవాలని.. అందరు సలహా ఇచ్చినా.. ఒక నటిగా నాకు వచ్చిన మంచి ఆఫర్ ని వదులు కోలేదన్నారు. జీవితంలో ఏ తప్పు చేయలేదని .. బాధ పడుతూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఏముందని అనిపించిందని సమంత తెలిపారు. ఆత్మాభిమానం.. గౌరవం ..కాపాడుకునేందుకే.. సమయం కేటాయించానని సామ్ అన్నారు. పుష్ప సినిమా విడుదలైన తర్వాత.. నా ఫ్యాన్స్.. నా నిర్ణయాన్ని సమర్థించారు.
జీవితంలో చాలా బాధలు పడ్డానని మయోసైటిస్ వల్ల నాపై నాకే కంట్రోల్ లేకుండా పోయిందని సమంత తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురును నా కళ్లు తట్టుకోలేవని అన్నారు. ఎన్నో దాటుకుని ఈ స్థాయికి వచ్చానని ఎవరైనా నా లుక్స్ గురించి కామెంట్లు చేసినా పట్టించుకోనని చెప్పారు. అయితే సమంత తాజాగా నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. శివనిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విడాకులపై తాజాగా సమంత చేసిన కామెంట్స్ ను.. ప్రమోషనల్ స్టెంట్ అని కూడా కొందరు భావిస్తున్నారు. శాకుంతలంకి హైపై తీసుకొచ్చేందుకు వ్యక్తిగత అంశాలని సమంత తెరపైకి తీసుకొచ్చిందంటూ ఆరోపిస్తున్నారు. యశోద చిత్ర ప్రమోషన్స్ లో కూడా తన మయోసైటిస్ వ్యాధి గురించి మీడియాకి చెప్పి పెద్ద ఎత్తున పబ్లిసిటీ దక్కించుకుంది. ఇప్పుడు కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం సమంత పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.