వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరేస్తాం: సవితమ్మ

వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరేస్తాం: సవితమ్మ

పెనుకొండ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరేస్తామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి సవితమ్మ సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణపై విరుచుపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పెనుకొండకు నీది టూరిస్ట్‌ వీసా, నాది పర్మినెంట్‌ వీసా, నీ వీసా దగ్గర్లోనే ముగుస్తుందని హెచ్చరించారు. నేను పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్స్‌ కూడా రాకుండా ఎక్కడ ఓడిపోతానో భయం చుట్టుకుని ఇలా వంకర మాటలు మాట్లాడుతూ కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతు పబ్బం గడుపుకుంటున్నావని విమర్శించారు. ముందు నీ పార్టీలో నీకు టికెట్‌ ఉందో లేదో చూసుకో సొంత పార్టీ కార్యకర్తలతో, నాయకులతోనూ చెప్పులతో కొట్టించుకున్న నీకు ఇంకా సిగ్గు రాలేదా అన్నారు.

మీ పార్టీ పుట్టినప్పటి నుండి ఎంతోమంది నియోజకవర్గంలో వైసిపి జెండా మోసిన నాయకులు ఉన్నారు వాళ్లకు టికెట్‌ రాకుండా మీ పార్టీ కి డబ్బులు ఇచ్చి టికెట్టు కొనుకున్న ఘనత నీది అన్నారు. నేను ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్న ఇక్కడే రాజకీయం కూడా చేస్తా నీలాగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేయలేదన్నారు. 2024లో నిన్ను నియోజకవర్గం నుండి ప్రజలే తరిమి కొడతారని తెలిపారు. 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం నీవు, నీ తమ్ముళ్ల అక్రమాలు, నీ బినామీ ఆస్తుల చిట్టి విప్పి ప్రజలు ముందర పెడతాం అంటూ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణని హెచ్చరించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *