మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి వున్నాం  నారా లోకేష్ వెల్లడి

మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి వున్నాం నారా లోకేష్ వెల్లడి

ఎస్సీ వర్గీకరణ అంశంపై మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగుండ్ల ఎస్సీ (మాదిగ) కాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. పలుచోట్ల ఎస్సీలకు కొండలు, గుట్టలపై పట్టాలు ఇచ్చారు, దీనివల్ల మరుగుదొడ్లు నిర్మించుకోవడం సాధ్యం కావడం లేదు. అటువంటి చోట్ల ప్రభుత్వమే మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలి. శ్మశాన వాటికకు స్థలం కేటాయించండి.

వైసిపి ప్రభుత్వం వచ్చాక కులాంతర వివాహాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చాక గతంలో మాదిరిగా అందజేయండి.

వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ పేదలకు ఉపయోగపడే అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలి.

ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాకు న్యాయం చేయండి.దళితులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

కోర్టుల్లో పెండింగ్ ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు చెందాల్సిన రూ.28,147 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించిన దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి.

దళిత డాక్టర్లు సుధాకర్, అచ్చెన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. ఇసుక అవినీతిపై ప్రశ్నించిన వరప్రసాద్ కు శిరోముండనం చేసి అవమానించారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల కోసం గత ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *