సచివాలయ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలి : నారా చంద్రబాబు నాయుడు

సచివాలయ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలి : నారా చంద్రబాబు నాయుడు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వారి బకాయిల వెంటనే చెల్లించాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి రాసిన లేఖలో కోరారు.

లేఖలో అంశాలు:-

• గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది క్రమబద్ధీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

• సచివాలయ సిబ్బంది కి 2021 అక్టోబర్ ప్రోబేషన్ పూర్తయింది. 2022 జూన్ నుంచి రెగ్యులరైజేషన్ జరిగింది.

• రాష్ట్ర ప్రభుత్వం వారికి 2021 అక్టోబరు నుంచి పే స్కేల్‌ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. అయితే ఆ బకాయిలకు మాత్రం చెల్లించలేదు.

• మరోవైపు గ్రామ/వార్డు సచివాలయాలలో ఇంకా దాదాపు 40,000 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ పెండింగ్ లో ఉంది.

• ఇది ఉద్యోగుల మధ్య అసమానతలను సృష్టిస్తోంది.

• సచివాలయ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లింకపోవడం….కొందరికి క్రమబద్ధీకరణ చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

• గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని తక్షణమే క్రమబద్ధీకరించాలి.

• క్రమబద్ధీకరించబడిన సిబ్బందికి పెండింగ్ బకాయిలు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి.

• AP గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (APGLI), కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS), ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) కింద గ్రామ/వార్డు సెక్రటేరియట్ సిబ్బంది నుండి మినహాయించబడిన మొత్తాలను వెంటనే సంబంధిత ఖాతా హెడ్‌లలో జమ చేయాలి.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *