కేటీఆర్ పేరు రాసి శేజల్ సూసైడ్ అటెంప్ట్

కేటీఆర్ పేరు రాసి శేజల్ సూసైడ్ అటెంప్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లైంగిక వేధింపుల ఆరోపణలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతో చేస్తుందని గొప్పలు చెబుతున్న వారే, ఆడవారిని వేధిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు బయటికొస్తే పార్టీ పరువు పోతుందని హైకమాండ్ సైలెంట్ గా ఉంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్‌ డెయిరీ డైరెక్టర్‌ శేజల్‌ రెండు నెలలుగా తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేస్తోంది. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా శేజల్‌ వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఇక్కడ న్యాయం జరుగకపోవడంతో ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఇంటివద్ద నిరసన చేపట్టారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌కు ఆమె నేరుగా ఫిర్యాదులు చేసింది. విసిగిపోయిన ఆమె తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేజల్ విషయంలో కేటీఆర్ స్పందిస్తూ…ఆమెపై లైంగిక దాడి జరగలేదని చెప్పారు. ఆమె చేసేవి ఆరోపణలేనన్నట్టుగా కొట్టిపారేశారు. దీంతో, తనకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన మంత్రి కేటీఆర్, మోసం చేసారనే ఆవేదనతో శేజల్ సూసైడ్ చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఓ ఆడపిల్ల తనను ఎమ్మెల్యే వేధిస్తున్నాడని.. ప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇక, మంత్రి కేటీఆర్ నమ్మక ద్రోహం చేశారంటూ… శేజల్ రాసిన లేఖ దుమారం రేపుతోంది.

మరోవైపు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపైనా తరచూ లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. జానకీపురం సర్పంచ్ నవ్య… రాజయ్య తనను వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తన భర్తను ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తోంది. ఈ అంశం తెలంగాణలో రాజకీయంగా కాక రేపుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నవ్య విషయంలో పెద్దగా స్పందించకపోడం గమనార్హం. రాజయ్య లైంగిక వేధింపులకు సంబంధంచి ఆధారాలున్నాయని బాధితురాలు చెబుతుంటే.. ఆమె ఆరోపణలు మాత్రమే చేసింది, తప్పని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు.

మొత్తంగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెను దుమారమే రేపుతున్నాయి. అదంతా ప్రత్యర్థుల కుట్ర అని అధికార పార్టీ ఆరోపిస్తే సరిపోదు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *